* మెట్ట రైతులకు గట్టి మేలు
* ఎమ్మెల్యే పర్వత దాతృత్వం

శంఖవరం, 10 ఏప్రిల్ 2021
————————————–
ట్టి మాటలు కట్టి పెట్టి… గట్టి మేలు తల పెట్టవోయ్… అని మహా కవి గురజాడ అప్పారావు చెప్పిన మంచి మాటను తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ ప్రసాద్ అక్షరాలా చేతల్లో చేసి చూపించారు. తన.ప్రత్తిపాడు నియోక వర్గం అంతా పకృతి సిద్ధంగా వ్యవసాయ ప్రాంతం. ఇక్కడ వ్యాపారాల కన్నా వ్యవసాయమే ఎక్కువ.పైగా మెట్ట ప్రాంతం, వర్షాధారం కావడం, పంట కాలువలు ఎప్పుడూ పూడుకుపోయి ఉండటం వల్ల రైతుల కష్టం కొలిమి కాష్టంగా మారి పోతోంది. స్వతహాగా రైతు పుత్రుడు అయిన ఎమ్మెల్యే తన తోటి రైతుల కష్టాలను తాను ఎమ్మెల్యే అయిన తొలి వాళ్ళలోనే ఆయన గుర్తించారు. తమ కుటుంబాలకు ఫ్లజాప్రాతినిధ్య పదవులను అందించిన కృషిలో రైతు బాంధవుల కృషి కూడా ఉన్నందున దానికి బదులుగ వారికి కృతజ్ఞతగా ప్లత్యుపకారం చేయాలని ఎమ్మెల్యే తీర్మానించు కుప్నారు. వెంటనే రూ. 10 లక్షలతో పళ్ళ చక్రాల జేసీబీ. 70 ని కొనుగోలు చేసే 8న ఎన్నికల సందర్భంగా తానే ప్రారంభించి నియోజకవర్గం సామూహిక రైతాంగానికి అంకితం ఇచ్చారు.

అంటే ఈ జేసీబీ సేవలు రైతులకు ఉచితం. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని ఏ ప్రాంతం సామూహిక రైతాంగమైనా తమ భూములకు సాగు నీరు అందించే కాలువల్లో పూడిక తీసుకునేందుకు ఈ జేసీబీని ఉచితంగా ఉపయోగించు కోవచ్చు. మరీ బీద రైతాంగం అయితే దాని ఇంధన ఖర్చును కూడా తానే రైతుల ప్రయోజనార్ధం భరిస్తానని, అవసరమైతే మరో జేసీబీని కూడా తాను కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా అంకితం ఇస్తాననీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ హామీ ఇచ్చారు. వ్యక్గగత, వ్యాపార ప్రయోజనాలకు మాత్రం తాను ససేమిరా ఇవ్వను అన్నారు. ఇది వరకే ఎమ్మెల్యే తాను శంఖవరం మండలం గొంధి కొత్తపల్లి గ్రామంలోని ఏలేరు రిజర్వాయరు మిగులు నీటి(సీపేజ్ వాటర్)ని పెదబాపన్నదొర చెరువుకు నీరందించే కాలువను 2019 డిసెంబర్ నాటికే పూడికను సొంత సొమ్ములు రూ. 10 లక్షలతో తీయించి ఆ విషయాన్ని 2020 జనవరి 13 న శంఖవరం బస్టాండ్ సెంటర్లో ప్రభుత్వం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అశేష జనవాహిని సమౕక్షంలో తానే స్వయంగా ప్రకటించి జనం మెచ్చిన నేతగా కితాబు అందుకుని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ రైతు బాటధవుడు అయ్యారు. నియోజకవర్గ ప్రజలకు హమీప భవిష్యత్తులో ఏయే మేలులను ఆయన సొంత సొమ్ములతో చేయనున్నారో మరి…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *