* విజయ వంతం చేయండి

* శంఖవరం ఎంపీడీవో. రాంబాబు పిలుపు 

శంఖవరం, 10 ఏప్రిల్ 2021
—————————————-
11 నుంచి 15 తేది వరకూ కేంద్ర ప్రభుత్వం టీకా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నదని, దీనిని నేడు ప్రారంభిస్తారనీ, ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని 29 ప్రభుత్వ శాఖల అధికారులు విధిగా పాల్గొని విజయవంతం చేయాలని శంఖవరం మండలం పరిషత్తు అభివృద్ధి అధికారి జె.రాంబాబు పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం అందరు అధికారులకు ఆదేశాలను జారీ చేసారు. కరోనా వ్యాధి నివారణ, అవగాహనా కార్యక్రమ ఫ్రంట్ లైన్ వారియర్స్ లోని వివిధ విభాగాల్లో సేవలను అందిస్తూ ఇప్పటి వరకూ కరోనా నివారణా టీకాలను వేసుకోని సిబ్బంది అందరూ ఈ టీకా మహోత్సవంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం
విధిగా పాల్గొని టీకాలను వేసుకోవాలని ఆయన ఆదేశించారు. సచివాలయం, రెవెన్యూ, పంచాయితీ కార్యదర్శులు, వెలుగు, ఉపాధి, ఆస్పత్రి, రెవెన్యూ, మండలం పరిషత్తు తదితర అన్ని శాఖల సిబ్బంది అందరూ ఆదివారం ఐనా సరే ఉదయం 8 గంటలకు ముందే సంబంధిత శాఖా కార్యాలకు చేరుకోవాలని ఆయన ఆదేశించారు. మండలంలోని శంఖవరం, పెదమల్లాపురం, అలాగే ప్రత్తిపాడు మండలం శాంతిఆశ్రమం, తొండంగి మండలం రావికంపాడు గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో మండలంలోని 14 పంచాయితీలు, 16 సచివాలయాల పరిధిలోని నేటి వరకూ కరోనా నివారణా టీకాలు వేసుకోని 29 ప్రభుత్వ శాఖల ఉద్యోగులు అందరూ రెండు డోసుల కరోనా టీకాలను వేసుకోవాలని ఎంపీడీవో. జె.రాంబాబు ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *