లోపలి మనిషి …
—————————-

ఊరు తన్ని
తరిమేసింది
నే చెడ్డోడినని …
* * *
నడచి వగచి సొమ్మసిల్లిన
నను ఆ చెరువు గట్టు
అమ్మలా అక్కున చేర్చుకుంది …
* * *
తన కన్నీటిని దయతో
నాపై ఎదజిమ్మింది
తన పయ్యెదపై నను సేదతీర్చింది …
* * *
తటాకం తేట నీటిలో
నా ప్రతిబింబాన్ని చూసుకొన్నా
అచ్చం అచ్చోసినట్టు నాలానే ఉంది…
* * *
ఆ నిశ్చల చిత్రంపై విచిత్రంగా
గులక రాయి విసిరా
ప్రతిబింబం చనిపోయింది ….
* * *
నా చిత్రాన్నే చంపిన లోపలి మనిషి
చనిపోయే దెప్పుడని ఊరు
మళ్ళీ నను బహిష్కరించింది …!
———————————————
జక్కల నాగసత్యనారాయణ
పాత్రికేయుడు, కవి, రచయిత
9492961961,
Janasa143@gmai.com
Janaasavaartha.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *