* కార్యక్రమ విజయానికి కమిటీలు
* జెసి కీర్తి చేకూరి

కాకినాడ, 10 ఏప్రిల్ 2021
————————————-
కాకినాడ జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లలో ఉత్తమ సేవలందిచిన వారిని సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాలతో సత్కరించే కార్యక్రమం ఈ నెల 12 వ తేదీన ప్రారంభం కానుందని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. వాలంటీర్లకు సత్కార కార్యక్రమంపై జిల్లా కేంద్రం కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో
శనివారం నిర్వహించిన సమావేశంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జెడ్ పి.సిఇఒ. ఎవీవీ. సత్యనారాయణ తదితరులతో కలిసి జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ డి.మురళీధర్‌ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తదితరులతో పాటు ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ విభాగాల అధికారులతో జేసీ సమీక్షించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి, మునిసిపల్, వైద్య ఆరోగ్యం తదితర శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి 21 వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా వాలంటీర్లకు సత్కార కార్యక్రమాలు జరగ నున్నాయని తెలిపారు. తొలి రోజు 12 వ తేదీన కాకినాడ అర్బన్, రూరల్ నియోజవరాలకు సంబంధించిన కార్యక్రమాన్ని రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో జరగనుంది అన్నారు. కార్యక్రమాన్ని విజయ వంతం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ కృషి చేయాలని జేసీ సూచించారు. నేటి ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, డిపిఒ ఎస్వీ నాగేశ్వర్‌నాయక్, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు, డిఎంహెచ్ఓ కేవీఎస్ గౌరీశ్వరరావు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *