యస్.రాయవరం, 12 ఏప్రిల్ 2021.
—————————————————
ఓ ప్రైవేట్ లేవుట్ కాలనీ మురుగు నీరు మొత్తం నడిరోడ్డుఫై పారుతోంది. ఫలితంగా ఈ రోడ్డులో నిత్యం ప్రయాణించే జనం బాదలు మాత్రం స్థానిక అధికార గణంనకు వంటపట్టడం లేదు. విశాఖ పట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గం మండల కేoద్రం యస్.రాయవరం గ్రామ పంచాయతీ పరిధిలోని యస్.రాయవరం నుండి పి.ధర్మవరం పోవు తారు రోడ్డును ఆనుకొని చిన్నమదుము వద్ద యలమంచిలి గ్రామ నివాసి, వేంకటేశ్వైర ఫైనాన్స్ యజమాని కర్రి ధనరెడ్డి చేస్తున్న నిరాటంకం ఇది.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా హైటెన్షన్ విద్యుత్ తీగల క్రింద నిర్మించిన ఓ ప్రైవేట్ లేఔట్ అయిన శ్రీవెంకటేశ్వర నగర్ లోని మొత్తం వ్యర్థ నీరు అంతటినీ తారు రోడ్డు పైకి వదలి వేస్తున్నారు. ఫలితంగా రోడ్డు పాడవడంతో పాటు, వీధి మొత్తం బురద మయంగా మారింది. కాలనీ
చుట్టు ప్రక్కల గృహస్తులకు చెడు వాసన వస్త్తోంది. మురుగు నీరు నిల్వ ఉన్నందు వలన ప్రజలు దోమలు, రోగాల బారిన పడుతున్నారు. పక్కనే ఉన్న గురజాడ విద్యా నికేతన్ విద్యార్ధిని, విద్యార్థులు రోజూ ఈ బురద నీటిలో నుండి పాఠశాలలోనికి వెళ్ళ వలసిన దుస్థితి ఏర్పడింది.

పలు మార్లు గ్రామస్తులు గ్రామ పంచాయతీ అధికారులకు పిర్యాదు చేసినా కనీస చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. స్వచ్ఛ భారత్, కోవిడ్-19 అంటూ ఆరోగ్య సూత్రాలు వల్లిస్తూ, ప్రచారాలు ఊదర గొడుతున్న మండల ప్రభుత్వ అధికారులు, నాయకులూ ఇదే రోడ్డుపై రోజూ తిరుగుతున్నా చర్యలు తీసుకోక పోవడం వారి అసమర్థతకు అద్దం పడుతోంది. అర్ధ, అంగ, రాజకీయ బలం, అండదండలు ఉన్న వ్యక్తులు ఏ తప్పులు చేసినా చెల్లుతుందని, వీరి జోలికి అధికారులు, నాయకులు వెళ్లరనేందుకు నిదర్శనమే అధికారుల అచేతన స్థితి. అదే సామాన్య పౌరుడు ఏ చిన్న తప్పు చేసినా సిబ్బందితో సహా వెళ్లి ప్రతాపం చూపుతారు.


ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, కనీసం సామాజిక బాధ్యతగా ఆలోచించి చర్యలు తీసుకొని, ప్రజల కష్టాలు తీర్చాలని యస్. రాయవరం మండలం యునైటెడ్ ఫారం ఫర్ ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డి రాజు కోరు తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *