* క్రింది స్థాయి అధికారులు చేతులెత్తేశారు
* ఇక కలెక్టర్ కాకుంటే సిఎం.దిగిరావాలా…?

యస్.రాయవరం, 12 ఏప్రిల్ 2021
————————————————-
విశాఖపట్నం జిల్లా, యస్.రాయవరం మండలం, యస్.రాయవరం గ్రామంలోని కర్రి ధనరెడ్డి అక్రమ నిర్మాణాలపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరుత యస్.రాయవరం మండలం యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డి వెంకట అప్పల సత్య సన్యాసి నూకరాజు, స్థానిక గ్రామ పంచాయతీ 13 వ వార్డు సభ్యుడు గాలి సత్యనారాయణ, గ్రామస్తులు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం యస్.రాయవరం గ్రామంలో సినిమా హాలు స్థలంలో నిర్మించిన కళ్యాణ మండపంనకు సర్వసిద్ది పంట కాలువ ఆక్రమించి ముందు వైపు రెండు వంతెనలు, వెనుక వైపు రెండు వంతెనలు పొలంలో నిర్మిoచుకున్న గెస్ట్ హౌస్ కి అక్రమంగా ఐదవ నంతెన, పంట కాలువను ఆక్రమించి ప్రహరీ గోడ, పొలముకు మరో వంతెన మొత్తం 6 వంతెనలతో పాటు పంట కాలువకు మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని ఆక్రమించి కల్యాణ మండపంనకు ప్రహారీ గోడ నిర్మించడం, చిన్న మదుము వద్ద ఇతని వెంకటేశ్వర లేఔట్ కు ఎదురుగా ఉన్న పంట కాలువకు, తారు రోడ్డుకు మధ్య ఉన్న స్థలంలో అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపించి తగు చట్టబద్ధమైన చర్యలను తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కలెక్టర్ ను కోరారు.

అక్రమంగా ఐదు వంతెనలు నిర్మాణం….
——————————————————–
యస్.రాయవరం గ్రామంలో పాత సినిమా హాలు స్థలo లో నిర్మించిన కళ్యాణ మండపంనకు ఇప్పటికే పంట కాలువ ఆక్రమించి 5 బ్రిడ్జిలు నిర్మించిన వెంకటేశ్వర కళ్యాణ మండపం యజమాని మరియు వెంకటేశ్వర ఫైనాన్స్ యజమాని ఎలమంచిలి గ్రామ నివాసి
కర్రి ధనరెడ్డి 6 వ బ్రిడ్జి అక్రమ నిర్మాణంపై ఎలమంచిలి సర్కిల్ జలవనరుల శాఖ డి.ఇ.ఇ. శ్రీమతి ఇ.సుజాత, ఏ.ఇ శ్రీ చిన్నారావు యస్.రాయవరం కు కన్వీనర్, యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ, యస్.రాయవరం మండలం, సోమిరెడ్డి రాజు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై డి.ఇ.ఇ. శ్రీమతి ఇ.సుజాత స్వయంగా వెళ్లి పరిశీలించి చట్టపరంగా చర్యలు చేపడతానని రాజు కు హామీ ఇవ్వడం జరిగింది. వెంకటేశ్వరా కల్యాణ మండపం ముందు వైపు ఎం.పి.డి.ఒ, తహసీల్దార్ కార్యాలయం లకు ఎదురుగా ఒక బ్రిడ్జ్, వెనుక వైపు యస్.రాయవరం – గూoడ్రిబిల్లి వెళ్ళు మార్గంలో పంట కాలువ పై కల్యాణ మండపం కు మరో భారీ బ్రిడ్జ్, మరొకటి తన ఇంటికి 2 బ్రిడ్జి లు నిర్మించారు. ఇప్పుడు మళ్ళీ కళ్యాణమండపం ముందు వైపున 2 వ బ్రిడ్జి ని తే 19.9.2020 ది న పంట కాలువ తన సొంతం అన్నట్లు కుర్సీ వేసుకొని కూర్చొని మరీ పనులు చేయిస్తుoటే, గ్రామస్తులు ముక్కు మీద వేలుకుంటుoటే నవ్విపోదురు నాకేమీటి, మంది మార్బలం, మా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉందంటూ నిర్మాణాలు చేపట్టడం విశేషం. గతంలో 5 నిర్మాణాలు చేసినా మండల అధికారులు ఎవరూ పట్టించుకోక పోవడంతో తన ఇష్టారాజ్యం అన్నట్లు నిర్మాణాలు చేస్తున్నారు. రైతుల పంటలకు ఆధారమైన పంట కాలువలు ఆక్రమించి, అన్నం పెట్టె రైతన్నలకు సున్నం బొట్లు పెట్టే, ఇటువంటి వ్యక్తులు నాయకుల అనుచరులు కావడం మా దౌర్భాగ్యం కాక మరేమిటి. సర్వసిద్ది వద్ద గెస్ట్ హౌస్ వద్ద పంటకాలువ మొత్తం ఆక్రమించి ప్రహరీ నిర్మించి, ప్రహరీకి వైస్సార్ పార్టీ రంగులు వేసి, ఆక్రమణలకు వైస్సార్ పార్టీ మద్దత్తుతోనే చేసినట్లు సందేశం ఇవ్వడం ఏ విధమైన సంస్కృతో ప్రజలకు సంబంధిత బాధ్యులు తెలపవలసి ఉన్నదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిషేదాజ్ఞలు ఉల్లంఘించి నిర్మాణాలు ….
—————————————————-
ఈ అక్రమ నిర్మాణాలపై నీటి పారుదల శాఖ అధికారులకు రాజు లోగడ ఫిర్యాదు చేసిన ఫిదప ధనరెడ్డి చేస్తున్న పనులు పరిశీలించిన ఇరిగేషన్ జేఈ నిబంధనలకు విరుద్ధమైన ఈ నిర్మాణాలను ఆపివేయాలని ఆదేశించగా బొలిశెట్టి గోవింద రావు, ఎమ్మెల్యే గొల్ల బాబురావుతో మాట్లాడి మీకు చెప్పిoచనా, నన్నే ఆపమంటారా అంటూ జలవనరుల శాఖ సిబ్బందిపై ధనరెడ్డి రంకెలు వేసాడని, రేపు ఏ.ఇ శ్రీ చిన్నారావు వచ్చి పరిశీలిస్తానన్నారు, అయన చెప్పిన మాట మీకు చెబుతున్నాము అని చెప్పి జలవనరుల శాఖ సిబ్బంది వెళ్లిపోయారు. తరువాత రోజు తిరిగి మూర్కత్వoతో పని మొదలు పెట్టగా, సిబ్బంది మళ్లీ వచ్చి ఏ.ఇ శ్రీ చిన్నారావు గారు ఫోన్లో హెచ్చరించగా అప్పటికి పనులు ఆపి తరువాత ధనరెడ్డి పూర్తి చేసుకున్నాడు. ఈ కల్యాణ మండపం ఆనుకొని కట్టుకున్న ఇంటి సరిహద్దు దారుడైన శ్రీ ఆడారి యేసు స్థలం కలుపుకొని నిర్మాణం చేయగా పెద్దలు వెళ్ళి హేచ్చరించగా సరిచేసాడు. అదే విధంగా యస్.రాయవరం -సర్వసిద్ది పోవు దారిలో తారురోడ్డును అనుకొని ఉన్న పొలంలో నిర్మిoచుకున్న గెస్ట్ హౌస్ కి అక్రమంగా ఐదవ బ్రిడ్జిని ధనరెడ్డి నిర్మిoచాడు. ఆ ప్రక్కనున్న పొలం కు మరో 6 బ్రిడ్జిని నిర్మించాడు. సూచిక 1 ప్రకారం తే 23.06.2008 దిన జలవనరుల శాఖ, ఏ.ఇ, యస్.రాయవరం అక్రమ 6 బ్రిడ్జిలు తొలగించాలని నోటీసు జారీ చేయడం జరిగింది.

నోటీసు జారీతో చేతులు దులిపేసారు …
———————————————————–
నోటీసు జారీ చేసి చేతులు దులుపుకున్న జలవనరుల శాఖ అధికారులు తదనంతర చర్యలు చేపట్టకపోవడంతో అలుసుగా తీసుకొని ధనరెడ్డి తిరిగి కల్యాణ మండపం ప్రహరీ గోడకు, సర్వసిద్ది పంట కాలువకు మధ్య ఉన్న ఖాళీ స్థలం ఆక్రమించి మరో ప్రహరీ గోడను 30.03.2021న అక్రమ నిర్మాణం చేపట్టగా జల వనరుల శాఖ అధికారులకు తిరిగి సోమిరెడ్డి రాజు పిర్యాదు చేసారు. దీనిపై యస్.రాయవరం ఏ.ఇ చిన్నారావు, ధనరెడ్డి ని పనులు ఆపాలని సిబ్బందిని పంపగా, ఇతడు కార్యాలయంనకు వచ్చి ఏ.ఇ తో తెలియక కట్టానని తెలపడం విషేశం. తమ ఇరిగేషన్ భూములను సర్వే చేసి వాటి హద్దులను చూపి, హద్దులను స్థిరీకంచి
రాత పూర్వకంగా స్థానిక తహశీల్దార్ ను కోరి, సర్వే అనంతరం అక్రమ ప్రహరీని, ఇతర ఆక్రమణలను తొలగిస్తామని ఏఈ తెలిపారు. ఇంతటితో చేతులు దులిపేసు కుంటారో లేక
చర్యలు తీసుకొని ఆక్రమణలను తొలగించి, ప్రభుత్వ ఆస్తులను కాపాడి, రైతన్నలను ఆదుకొని మాట నిలబెట్టుకుంటారో వేచి చూడాలి.

షెడ్డు నిర్మాణమూ అక్రమమే….!
———————————————
గ్రామంలో చిన్న మదుము వద్ద ఇతనికి ఉన్న వెంకటేశ్వర ప్రవేట్ లేఅవుట్ కు ఎదురుగా యస్. రాయవరం – పి.ధర్మవరం తారు రోడ్డుకు సర్వసిద్ది పంట కాలువకు మధ్య ఉన్న ఖాళీ స్థలం ఆక్రమించి తన స్వార్ధం కోసం తన లేఅవుట్ అభివుద్ది కోసం మండల ప్రజలు అందరూ ఇబ్బందులు పడుతున్నా, షెడ్ నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ వంతెన మలుపు యస్ ఆకారంలో ఉండి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ఎన్నో ప్రమాదాలు జరిగి క్షతగాత్రులు అవుతున్నా, మండల అధికారులు అందరూ ఇదే రోడ్డుపై రోజు ప్రయాణం చేస్తున్నా, సంబoదిత అధికారాలు చర్యలు చేపట్టక పోవడం మండల ప్రజల దౌర్భాగ్యం కాక మరేమిటి. మదుము ఆవల వేంకటేశ్వరస్వామి గుడి వద్ద రద్దీగా ఉండడం, అటువైపు కూడా కాలవ గట్టున గుడి తాలుకా షెడ్ నిర్మించడం వలన అటు ఇటు ఎదురెదురుగా వచ్చిన వాహనాలు కనిపించక ప్రజలు ప్రమాదాలకు గురి అయి ఇబ్బందులు పడతారన్న కనీస స్పృహ కాని, సామాజిక భాద్యత కాని లేకుండా ప్రవర్తించడం ఇతనికే చెల్లిందని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఆక్రమణలు తొలగించాలని, లేకపొతే గ్రామస్తులు ఆందోళన చేపట్ట వలసి వస్తుందని తెలుపుతూ, అప్పటికీ న్యాయం చేయకపోతే న్యాయ పోరాటం చేయడం తప్ప మరో గత్యంతరం లేదని కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *