* అమ్మోరుకి వెండి కిరీటం బహుకరణ

సీతయ్యమ్మపేట, 13 ఏప్రిల్ 2021
———————————————–
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం
శంఖవరం మండలం సీతంపేట గ్రామం దుర్గమ్మ కొండపై కొలువు దీరిన దుర్గా మీనాక్షి అమ్మ వారి ఆలయానికి ఉగాది పర్వదినాన్ని పురష్క రించుకుని భక్తులు పోటెత్తారు. పిఠాపురం గ్రామానికి చెందిన కాలిగట్ల నాగ శివకుమార్ దంపతులు అమ్మ వారికి వెండి కిరీటాన్ని బహూకరించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని ఆలయ పూజారి సతీష్ కుమార్ శర్మ వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ వ్యవస్ధాపకులు తులసి గుర్రప్ప ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక భక్తులతో పరిసర వివిద గ్రామాల నుండి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మ వారిని దర్శించుకుని కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అమ్మ వారి దర్శన బాగ్యం కల్పించి, తీర్ధ, ప్రసాదాలను కమిటీ సభ్యులు పంపిణీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *