(కాకరపర్తి బులివీరన్న , 9949058502)

వికారి నామ సంవత్సరము 2019 పేరుకు తగినట్టుగా వికృతంగా నాట్యం చేసింది. శార్వరి (అంటే చీకటి) నామ సంవత్సరం 2020 ప్రపంచాన్ని అంధకారంలోనికి నెట్టింది. ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం మొదలైనది. ఇది శుభ ప్రదమైన సంవత్సరం. ఎందుకంటే… ప్లవ అంటే… దాటించునది అని అర్థం. “దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం ….” అనగా దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహ సంహిత గ్రంధం అర్ధాన్ని వివరించింది. అంటే మనం తరచూ తమసోమా జ్యోతీర్గమయ… అని మనం అనుకుంటున్నట్లే… మనల్ని చీకటి నుంచి వెలుగులోనికి నడిపిస్తుందని అర్థం.

వికారి, శార్వరి తమ పేర్లకు తగ్గట్టుగా మనల్ని నడిపించాయి గదా. మరి ప్లవ తన పేరును సార్థకం చేసుకుంటుందని ఆశించటం తర్కసహితమైన, వివాద రహితమైన ఆలోచనయే గదా. ప్లవ నామ సంవత్సరం ముగియగానే “శుభకృత్”, ఆ తరువాతది ” శోభకృత్” సంవత్సరములు. ఈ పేర్లకు తగ్గట్టుగా ఇవి కూడనూ మన మనసుకు సంతోషాన్ని, మేధో వికాసాన్ని కలిగిస్తాయని, మన సుఖమయ జీవన యానానికి అభయాన్ని ప్రసాదిస్తాయని కోరుకుందాం. ఇక మన ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం… సుస్వాగతం. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది గుణములు… శుభాకాంక్షలు… తధాస్తు …!

                * * * * * *

బులివీరన్న గురించి కొంత…
——————————————–
” దూరపు కొండలు నునుపు ” అన్నట్లు దూరం నుంచి చూస్తే…. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి సచివాలయం 1 కార్యదర్శి కాకరపర్తి బులివీరన్న మనలాంటి ఓ సాధారణ పౌరుడు. అదే ఆయన్ని దగ్గరగా గమనిస్తే… ఆయనో మృధు స్వభావి. మితభాషి. పరోపకారి. యోగా అనుసరణశీలి. అచంచల ఆధ్యాత్మిక చింతనాపరుడు. తాత్వికుడు. అంతకు మించి బయటకు కనిపించని ఓ జ్యోతిష్య పరిజ్ఞాని. ఓ మానవతావాది. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను తన ఆధ్యాత్మిక, జ్యోతిష్య, స్వానుభవ పరిజ్ఞానంతో సమ్మిళితం చేసి చెప్పే ఓ మంచి విశ్లేషకులు. “ముఖమే అంతర్భావ సూచి” యని సామెత చెప్పినట్టు మనం ఆయనకు ఓ సారి తారస పడితే చాలు మన మనఃస్వభావం, మన జాతక చరిత్రను ఆయన ఇట్టే పసికట్టేయ గలరు. ఇటువంటి విశిష్ట లక్షణాలు అందరిలోనూ లేక పోవచ్చు. ఏ కొందరిలోనో ఉండొచ్చు. ఆయా పౌరుల విశిష్ట లక్షణాలతోనే వారి గౌరవ మర్యాదలు ఇనుమడిస్తూ ఉంటాయి. మన బులివీరన్న మన అందరికీ గౌరవనీయులే కాదు…. మర్యాదస్తులు కూడా … ఆయన మంచి తనాన్ని  అభిమానించే  వారికి ఆయనో ఆరాధనీయులు…  శుభం శీఘ్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *