* స్వామి కోనేరుకి ప్రారంభోత్సవం…

శంఖవరం, 14 ఏప్రిల్ 2021.
——————————————-
ఆంధ్రా శబరిమల అయ్యప్ప సన్నిధిలో  14న  అయ్యప్పకు నేడు విషు పండుగను  నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని నేత్ర వైభవోపేతంగా విజయ వంతం చేయడానికి అన్ని ఏర్పాట్లూ చకాచకా పూర్తి అయ్యాయి.
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలం పెదమల్లాపురం పంచాయితీ శివారు సిద్ధివారిపాలెంలోని ఆంధ్రా శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలో నేడు ఈ విషు ఉత్సవాన్ని  నిర్వహిస్తామని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, భూపతి, గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత కుసుమంచి శ్రీసత్యశ్రీనివాసరావు గురుస్వామి వెల్లడించారు. 14న అయ్యప్ప స్వామి విషు పండగను భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహిస్తా మన్నారు. అయ్యప్ప స్వామి గర్భ గుడిలో మూల విరాట్ కు కేరళ ఆధ్యాత్మిక సంప్రదాయం మాదిరిగ నటరాజ్ శర్మ నేతృత్వంలో కలబాభిషేకాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

ఆంధ్రా శబరిమల అయ్యప్ప ఆలయాన్ని నిర్మించి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తొలి సారిగా స్వామి సన్నిధిలో  కోనేరును 19.26×4 అడుగుల విస్తీర్ణపు చతురస్రం చుట్టు కొలతల్లో నిర్మించామని, ఈ కొలనును నేడు ప్రారంభిస్తా మన్నారు. ఈరోజు స్వామి వారికి తొలి స్నానా(హోరట్ ఉత్సవా)న్ని ఈ కోనేరులోనే నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కోనేరు ప్రాంగణం లోనికి ప్రవేశించకోరు స్త్రీ, పురుష భక్తులు ప్రతి ఒక్కరూ దవళవర్ణ దుస్తులను విధిగా ధరించాలని ఆయన వెల్లడించారు. ఈ ధినం రాత్రి స్వామి వారి సన్నిధిలో పడి పూజను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదం వితరణతో పాటు మధ్యాహ్నం కాకినాడ జగన్నాధపురంలోని శ్రీఅయ్యప్ప అన్నదాన సంఘం ఆధ్వర్యంలో మహాన్న దానాన్ని నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రా శబరిమలకు వచ్చే భక్తుల కోసం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, కనుల పండుగగా నిర్వహించే ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. నిరంతరం స్వామి ఆలోచనల్లో లీనమై ధ్యానిస్తు ఉంటే భక్తులకు మానసిక ప్రశాంతత చేకూరు తుందని, ఫలితంగా సుఖవంతమైన, శాంతి యుత జీవనం సాగించ వచ్చునని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, భూపతి, గౌరవ డాక్టరేట్ గ్రహీత కుసుమంచి శ్రీసత్యశ్రీనివాసరావు గురుస్వామి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *