* కర్రి ధనరెడ్డి ధన మాయాజాలం
* పట్లని అధికార యంత్రాంగం

యస్.రాయవరం, 14 ఏప్రిల్ 2021
————————————————-
విశాఖపట్నం జిల్లా మండల కేంద్రం యస్.రాయవరం గ్రామంలో మెయిన్ రోడ్డును ఆనుకొని నిబంధనలకు విరుద్ధంగా 4 అంతస్థుల బిల్డింగ్ నిర్మించి క్రింది భాగం 6 వ్యాపార సంస్థలకు, మొదటి అంతస్థులో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం భోజనాల కొరకు , 2 వ అంతస్తులో పంక్షన్ హాల్ , 3 వ అంతస్థు కార్యాలయంగాను వాడుకుంటున్నారు . పంచాయితీ నిబంధనలు ప్రకారం జి +2 అంతస్తులకు మాత్రమే అనుమతి ఇస్తారు . తదనంతరం జి +3 నిర్మించాలంటే ఉడా ( VMDA ) , విశాఖపట్నం అనుమతులు పొందవలసి ఉన్నది . ఉడా ( VMDA ) విశాఖపట్నం , రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు ప్రకారం నిర్మించిన భవనాలకు మాత్రమే అనుమతులు ఇవ్వడం జరుగుతుంది . ఈ కాంప్లెక్స్ కళ్యాణ మండపం కొరకు ఒక్క అడుగు కాదు కదా , ఒక్క సెంటీ మీటర్ కూడా బిల్డింగ్ నాలుగు వైపులా వదలకుండా , తిరిగి మెయిన్ రోడ్డులో ఉన్న డ్రైనేజీ పైకి అక్షమించు కొని రెండు , మూడు , నాలుగు అంతస్తులు ముందుకు చొచ్చుకొని వచ్చి నిర్మించడం జరిగినది.

ప్రజలు నరకం చూస్తున్నారు …
—————————————-‌‌
ఈ విధంగా నిర్మాణం చేయడం వలన , కనీసం ఒక్క సైకిల్ , టూవీలర్ కూడా పెట్టుకొనే పార్కింగ్ లేక ఫంక్షన్లు రోజుల్లో ప్రజలు నరకం చూడడమే. అసలు రద్దీగా ఉండే సెంటర్ , మెయిన్ రోడ్లు కావడం , మెయిన్ రోడ్డును అనుకోని బిల్డింగ్ ఉండడం , పక్కన అంగిన వీధికి వెళ్ళు రహదారి మొత్తం టూవీలర్లు , కార్లుతో నిండిపోయి కనీసం నడిచి వెళ్లు స్థలం లేక ప్రజల కష్టాలు చెప్పనలవి కాదు . గ్రామం నడిబొడ్డున ఉండడంతో ఏ ఫంక్షన్ జరిగినా చుట్టు పక్కల గృహాల ప్రజలకు బాజా భజంత్రీలు , మంత్రాలూ , మందుగుండు సామాన్ల కాల్పుల ధ్వనుల వల్ల ఆరాత్రి వీరికి జాగారమే . కళ్యాణ మండపం , లాడ్జి , ప్యూరిఫైయిడ్ వాటర్ సెంటర్ , నిర్వహించాలంటే ప్రభుత్వం , వివిధ శాఖలు , స్థానిక సంస్థల నుండి , ముందస్తు అనుమతులు పొందవలసి ఉంటుంది . అయితే ఈ నిర్వాహకుడైన ఎలమంచిలి కర్రి ధనరెడ్డి , జిల్లా విపత్తులు, అగ్నిమాపక అధికారి , జిల్లా కార్మిక శాఖ అధికారి , వాణిజ్య పన్నుల అధికారుల , ఉడా అధికారుల , స్థానిక మండల మెజిస్ట్రేట్ మరియు తహసీల్దార్ , పోలీస్ అధికారులు , స్థానిక పంచాయతీ అధికారి తదితర అధికారులందరి నుండి ముందస్తు అనుమతులు పొందాక మాత్రమే వాణిజ్య కళ్యాణ మండపాలను నిర్వహించవలసి ఉంటుంది. సంబంధిత అధికారులు కూడా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం , భవన నిర్మాణం చేసి , ఏమైనా అనుకోని సంఘటనలు , దుర్ఘటనలు , అగ్ని ప్రమాదాలు గాని జరిగినప్పుడు ప్రజలు సురక్షితంగా , ఎటువంటి ప్రాణ నష్టము లేకుండా , క్షతగాతులు కాకుండా అన్ని ఏర్పాట్లు , సాధనాలు ఉన్ననాడు , మండపంకు వచ్చు వ్యక్తుల వాహనాలకు సరిపడా పార్కింగ్ ఉన్నపుడు మాత్రమే అనుమతులు ఇవ్వడం జరుగుతుంది .

కల్యాణ మండపాలూ అక్రమమే …
———————————————–
అయితే ఈ 2 కళ్యాణ మండపాలకు ఎటువంటి ముందస్తు అనుదమతులు లేవు సరికదా , ఇంక ప్రతి ఏడాది రెన్యూవల్ చేసుకునే విధానాలు ఏమీ పాటించక , ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి చెలగాటం ఆడుతూ నిర్వహిస్తున్నా , సంబంధిత అధికారులు ఎవరూ ఆ వైపు కన్నెత్తి చూడక పోవడంలో ఉన్న మతలబు ఊహించవచ్చు . ప్యూరిఫైయిడ్ వాటర్ సెంటర్ కు కార్మిక , ఫ్యాక్టరీ , ఫుడ్ లైసెన్స్ , ఎఎఐ తదితర లైసెన్స్ లు పొందవలసి ఉన్నది . మండల అధికారులకు , పంచాయితీ అధికారులకు పలు పిర్యాదులు చేసినా పట్టించు కున్న పాపాన పోలేదు . యస్.రాయవరం గ్రామంలో పాత సినిమా హాలు స్థలంలో , ఎం.పి.డి.ఓ , తహసీల్దార్ కార్యాలయం లకు ఎదురుగా నిర్మించిన కళ్యాణ మండపం , లాడ్జి , ప్యూరిఫైయిడ్ వాటర్ సెంటర్ కు ఇప్పటికే పంట కాలువలు ఆక్రమించి 4 బ్రిడ్జిలు నిర్మించి నిర్వహిస్తున్నాడు . ముందు వైపు ఎం.పి.డి.ఒ , తహసీల్దార్ కార్యాలయం లకు ఎదురుగా 2 బ్రిడ్జ్ లు , వెనుక వైపు యస్.రాయవరం గూండిబిల్లి వెళ్ళు మార్గం లో పంట కాలువ పై మరో 2 భారీ బ్రిడ్జ్ లు , జలవనరుల శాఖకు చెందిన ప్రభుత్వ స్థలం ను ఆక్రమించి నిర్మించారు . ఈ కల్యాణ మండపం కు పార్కింగ్ లేకపోవడంతో ఏ ఫంకన్ జరిగినా మెయిన్ రోడ్డు, ఎం.పి.డీ.ఓ. తహసిల్దారు కార్యాలయాలు ముందు టూవీలర్లు, కార్లు , తదితర వాహనాలతో నిండిపోవడం , వెనుక వైపు గూండ్రిదిల్లి వైపు వెళ్ళు రైతులకు , ప్రజలుకు , రోడ్డు పైనే వాహనాలు పెట్టడం వల్ల అసౌకర్యం కలుగు తున్నది . వెనుక వైపు రోడ్డునే బ్రాందీ షాపు ఉండడంతో అసలే రద్దీగా ఉంటుంది . తన కార్యాలయాల కు ఎదురుగా , తమ కళ్ళ ముందే , ప్రజలతో పాటు మీరు కూడా ఇబ్బందులు పడుతున్నా చర్యలు తీసుకోవలసిన ఈ మండల స్థాయి అధికారుల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ , పట్టించుకోక చోద్యం చూస్తున్నారు . ఇప్పటికైనా ఈ కళ్యాణ మండపం ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు పాటిస్తూ , పార్కింగ్ ఏర్పాట్లు చేసి , రోడ్లపై ఒక్క వాహనం నిలపకుండా చేసి , టాటా భజంత్రీల ధ్వని బైటకు రాకుండా చేసినట్టితనే కొనసాగనివ్వాలని , వైస్సార్ సెంటర్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నందున ఈ కళ్యాణ మండపం ను తణం మూయించ వలసి ఉన్నది.

అనుచరుడి ముసుగులో అక్రమాలు …
——————————————————-
స్థానిక వైస్సార్ నాయకుడి అనుచరుడి గా ఉంటూ పాల్పడుతున్న ఇతని ఆక్రమణ నిర్మాణాలు తొలగించాలని , నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వైస్సార్ సెంటర్ వద్ద కళ్యాణ మండపంను , ఎం.పి.డి.ఓ , తహసీల్దార్ కార్యాలయం లకు ఎదురుగా ఉన్న కళ్యాణ మండపం రెండింటిని సంబంధిత అధికారులు , నిబంధలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నందున మూచి వేయించే దిశగా చర్యలు చేపట్టాలని , చట్ట వ్యతిరేకం గా నిర్వహిస్తున్నందున నిర్వహకుడైన కర్ర దనరెడ్డి పై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకొని న్యాయం చేస్తారని , అప్పటికీ న్యాయం చేయకపోతే , న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తప్ప , పేరే గత్యంతరం లేదని తెలుపుతున్నాము . కాబట్టి వారు పైన తెలిపిన విషయాలన్నింటిపై విచారణ చేసి , అక్రమ నిర్మాణాలైన 4 బ్రిడ్జిలు , ప్రహరీ , తొలగించి రైతన్నలకు మేలు చేసి , ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించి , ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎటువంటి నిబంధనలు , ముందస్తు అనుమతులు పొందకుండా కళ్యాణ మండపంలు , లాడ్జి , ప్యూరిఫైయిడ్ వాటర్ సెంటర్లు , నిర్వయిస్తున్నందున మూసి వేయించే దిశగా చర్యలు చేపట్టాలని , శ్రీ కర్రి ధనరెడ్డి పై చట్ట ప్రకారం భూఆక్రమణ , తదితర క్రిమినల్ చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్, విశాఖపట్న జిల్లా విపత్తులు? అగ్ని మాపక శాఖ అధికారి, సూపరెండెంట్ అఫ్ పోలీస్, కార్మికశాఖ జిల్లా పంచాయతీ అధికారి తదితర శాఖల అధికారులకు బాధిత ప్రజానీకం ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *