శ్రీకాకుళం, 14 ఏప్రిల్ 2021
—————————————-
క్రీడా, సామాజిక సేవా రంగాలల్లో విశేష సేవలు అందించిన డాక్టర్ గుండబాల మోహన్ కు 2021 జాతీయ ఉగాది పురస్కారం లభించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈయనకు 2021 సంవత్సర ఉగాది పండగను పురస్క రించుకుని కళలు (ఆర్ట్స్) అసోసియేషన్ ఈ పురస్కారాన్ని మోహన్ కు బహూకరించారు. తెలంగాణ కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, కత్తిమండ ప్రతాప్, డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు చేతులు మీదుగా ఈనెల 13వ తారీఖున తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పట్టణంలో కోటి జంక్షన్లో సారస్వత పరిషత్ ప్రాంగణంలో పురస్కారాన్ని అందించారు. 15 సంవత్సరాలుగ వ్యాయామ వృత్తి విద్యలో మోహన్ ఉన్నారు. ఈయన పలు ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలో వ్యాయామ అధ్యాపకుడుగా, పలు ఇంజనీరింగ్ కళాశాలలో వ్యాయామ విద్య ఆచార్యునిగా పని చేశారు, 2013 సంవత్సరం నుంచి స్థానిక  శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని పెద్దపాడు ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. ఈయన వద్ద శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి కుస్తీ పోటీలోనూ, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఇప్పటికే పాల్గొని పలు విజయాలు సాధించారు.ఈయన పేద విద్యార్థులను వారిలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసి ఆయన తన సొంత ఖర్చులతో విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తున్నారు. ఈ జాతీయ స్థాయి ఉగాది పురస్కారానికి తనను ఎంపిక చేసిన సీ. సీ. టీవీ అధ్యక్షుడైన డాక్టర్ ఆరవెల్లి నరేంద్రకు మహాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *