* మీడియాను ఆశ్రయించిన బాధితుల

విశాఖపట్నం, 15 ఏప్రిల్ 2021
———————————————–
      అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండ చూసు కొని ఆ పార్టీ నేత బొలిశెట్టి గోవిందరావు, మరి కొందరు అతని అనుచరులు కల్సి మా వారసత్వ భూమిని ఆక్రమించు కునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారని బాధితులు ఆళ్ల భూలోక నాయుడు, శివ ప్రసాద రావు వెల్లడించారు. అందుకోసం భూముల రికార్డులను కూడా తారుమారు చేసారని వారు వెల్లడించారు.

    విశాఖపట్నంలోని ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో
గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో బాధితులు తమ గోడును వెళ్ళబోసు కున్నారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గం యస్.రాయవరం గ్రామ పరిధిలోని 156 సర్వే నెంబర్ లో 01.26 ఎకరాల భూమికి 2019 లో అప్పటి తహశీల్దార్ కోరాడ వేణుగోపాల్ ఇతర రెవెన్యూ అధికారుల అండతో బొలిశెట్టి గోవింద రావు అతని బినామీ గ్రామ మాజీ సర్పంచ్ లక్కోజు ఆదిమూర్తి పేరు మీద రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించి పాస్ బుక్ తీసుకున్నారని బాధితులు వెల్లడించారు. తమకు జరిగిన ఈ అన్యాయాన్ని సవాలు చేస్తూ తాము కోర్టును ఆశ్రయించగా తమకు అనుకూలంగా డిక్రీ వచ్చిందని పేర్కొన్నారు. అయినప్పటికీ రాజకీయ పలుకుబడితో తమపై బెదిరింపులకు పాల్పడుతూ భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరి దగ్గరకి వెళ్లినా భూమి తిరిగి వచ్చే పరిస్థితి లేదని బెదిరింపులకు దిగుతూ ఉన్నారు అన్నారు. ఈ విషయమై ఇప్పటికే నర్సీపట్నం సబ్ కలెక్టర్, లోకాయుక్తా లోను కేసు నమోదు చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ కి స్పందన లోనూ అర్జీ పెట్టామన్నారు. బాధితులమైన మా పేరుతోనే ఆ భూమి ఉందని చెబుతున్న రెవిన్యూ అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపి తమకి చెందాల్సిన విలువైన భూమిని అడ్డ దారిలో కొట్టేయాలని చూస్తూ ఉన్నారని వారు ఆవేదన చెందారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తప్పుడు రిజిస్ట్రేషన్ కు పాల్పడి పట్టాదారు పుస్తకాలు మంజూరు చేసిన రెవెన్యూ అధికారులపై విచారణ జరిపి, తమ పేరున రెవిన్యూ రికార్డుల్లో నమోదు చేసి,
పట్టాదారు పుస్తకాలు ఇచ్చి న్యాయం చేయాలని బాధితులు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ఆడారి జయ, మద్దాల లక్ష్మణరావు, యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *