అమరావతి, 15 ఏప్రిల్ 2021
——————————————–
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ నిర్వహణలో ఉన్న 164 ఆదర్శ పాఠశాల( AP. Model schools)ల్లో ఆరో తరగతిలో ప్రదేశాలకు ప్రకటన  జారీ చేసినట్లు మోడల్ స్కూల్స్ సొసైటీ కార్యదర్శి దుక్కిపాటి మధుసూధనరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021-2022 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు విద్యా ర్థులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని, ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ఉండే ఈ పాఠశాలల్లో  ఎటువంటి రుసుములూ వసూలు చేయరని చెప్పారు.

ప్రవేశ అర్హతలు ….
—————————
వయస్సు : ఓసీ , బీసీ విద్యార్థులు 01-09-2009 నుంచి 31-08-2011 మధ్య పుట్టి ఉండాలి. ఎస్సీ , ఎస్టీ విద్యార్థులు 01-09-2007 నుంచి 31-08 2011 మధ్య పుట్టి ఉండాలి. సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2019-20 , 2020-21 విద్యా సంవత్సరాల్లో చదివి ఉండాలి. 2020-21 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతూ ఆరో తరగతిలో ప్రవేశ అర్హత పొంది ఉండాలి. దరఖాస్తు చేయడానికి ముందుగా cse.ap.gov.in/apms.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలి. అభ్యర్థులు ఏప్రిల్ 16 నుండి మే 15 లోగా గేట్ వే ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించాలి. తరువాత వారికి ఒక సాధారణ సంఖ్యను కేటాయిస్తారు. ఆ సంఖ్య ఆధారంగా ఏదైనా ఇంటర్నెట్ కేంద్రంలో www.cse.ap.gov. in/apms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా అంతర్జాలంలో దరఖాస్తు చేయాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 50 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాలి. లాటరీ విధానంలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇతర వివరాలకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్, జిల్లా విద్యా శాఖాధికారి, మండల విద్యాశాఖాధికారిని సంప్రదించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *