* బడుల టాయిలెట్స్ కు అగ్ర ప్రాధాన్యం
* విద్య, పరిశుభ్రతతో పాటే ఆరోగ్యం కూడా
* శంఖవరం ఎంపీడీవో, ఎమ్ఈఓలు

(ఆదర్శ కళాశాల నుంచి జనాస)

శంఖవరం, 16 ఏప్రిల్ 2021
——————————————–
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గత ప్రభుత్వాల పాలనలో పాఠశాలల్లో సరియైన మరుగుదొడ్లు, తాగు నీరు వంటి కనీస ప్రాధమిక సౌకర్యాలు లేక బాలికలు బడి మానేస్తున్నట్టు నూతన ప్రభుత్వం గుర్తించిందని శంఖవరం మండల విద్యా శాఖాధికారి సూరిశెట్టి వెంకట రమణ పేర్కొన్నారు. బడి మానేస్తున్న ఈ సమస్యను అధిగమించ డానికి, భాలికా విద్యను మరింత ప్రోత్సహించ డానికి ఉత్తమ విద్యా ప్రమాలతో బోధన, మరుగుదొడ్లు, తాగు నీరు వంటి కనీస మౌలిక ప్రాధమిక సౌకర్యాలు, పరిశుభ్రతకు ప్రభుత్వం తాజాగా ప్రాధాన్యం ఇస్తోందని ఆయన వివరించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజ కవర్గం మండలం కేంద్రమైన శంఖవరం లోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల, కళాశాల రెండో అంతస్తులో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, పారిశుద్ధ్య పనివారైన ఆయమ్మలకు మరుగుదొడ్ల నిధుల వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణా అంశాలపై ఒక్క రోజు మండల స్థాయి శిక్షణను ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్ఈఓ మాట్లాడారు. తరగతిగి గదుల కన్న మరుగు దొడ్ల పరిశుభ్రత ముఖ్యమని, విద్య పరిశుభ్రతతో పాటే ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ప్రభుత్వం గుర్తించి, బడుల్లో సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణకు నిధుల కేటాయింపు, విడులతోపాటు ఆయమ్మలను నియమించిందని ఎమ్ఈఓ పేర్కొన్నారు. మరుగుదొడ్ల పరిశుభ్రతా ఫొటోలను మధ్యాహ్నం 12 గంటలలోగా ఐఎంఎఫ్ ఏప్ లో అప్ లోడ్ చేయాలని, వాటిని సి ఎం. పరిశీలిస్తారని చెప్పారు. శంఖవరం ఎంపీడీవో. జె.రాంబాబు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి సారిగా పాఠశాల మరుగుదొడ్లు పారిశుద్ధ్య నిర్వహణకు ఓ పథకాన్ని ప్రవేశపెట్టి, నిధులను కేటాయించడం విద్యార్థుల పట్ల ప్రభుత్వ చిత్త శుద్ధికి నిదర్శనం అన్నారు. పరిశుభ్రంగా ఉన్నామనుకున్న మనపై నిత్యం కొన్ని మిలియన్ల సూక్ష్మ క్రిములు(జెర్మ్స్) ఉంటాయని, అందువల్ల మనం మరింత పరిశుభ్రం(హైజీనిక్) గా ఉండాలని ఆదర్శ పాఠశాల శాస్త్ర విజ్ఞాన బోధకురాలు పద్మజానైని చెప్తూ చేతులను శుభ్రం చేసే శాస్త్రీయ విధానాన్ని చేసి సభికులకు చూపించారు. మరుగుదొడ్లు పరిశుభ్రత విధానాన్ని క్రియాత్మక ప్రత్యేక్ష పరిశీలనకు చేసి చూపించారు. ఆదర్శ ప్రిన్సిపాల్ జి. జ్యోతిలక్ష్మి ఆతిధ్య, ప్రత్యక్ష ప్రసార సహితంగా నిర్వహించిన ఈ కార్యక్రమానిక శంఖవరం మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల (మెయిన్) ప్రధాన ఉపాధ్యాయుడు కుర్రే వెంకటేశ్వరరావు రిసోర్స్ పర్సన్ గానూ, సీఆర్పీగా నాని వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *