అన్నవరం, 16 ఏప్రిల్ 2021.
—————————————–
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరంలోని శ్రీవీరవెంకట సత్యనారాయణస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి అధ్యక్షులు కె. లక్ష్మీనారాయణ శుక్రవారం ఉదయం 11గంటలకు
దర్శించు కున్నారు. ఈయనకు దేవస్థానం పీఆర్వో కొండలరావు ఆదేశానుసారం ఆలయ సిబ్బంది ఆయనకు ఆలయం మర్యాదలతో సత్యనారాయణ స్వామి దర్శన భాగ్యం చేయించారు. దేవస్థానం పాలక వర్గం మాజీ సభ్యులు శింగిలిదేవి సత్తిరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి సభ్యులు సుమారు 120 మంది లక్ష్మీనారాయణ వెంట ఉన్నారు. వీరిలో కొందరు శివ మాల ధారణ భక్తులు కూడా ఉండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *