* ఫలించిన ఆర్టీఐ కార్యకర్త రాజు ఫిర్యాదు
* రాజుకు అభినందనల వెల్లువ

ఎస్. రాయవరం, 17 ఏప్రిల్ 20221.
————————————————–
తారు రోడ్డుపై మురుగు నీరు పారుదల సమస్యను ఎట్టకేలకు అధికారులు అరికట్టారు. ఈ సమస్య తీవ్రతను, నష్టాన్ని అధికారుల దృష్టికి రాత పూర్వకంగా తీసుకు వెళ్ళి వారితో ఆ సమస్యను పరిష్కరింప చేయడలో స్థానిక ఆర్టీఐ కార్యకర్త రాజు చేసిన కృషి ఫలించింది. దీంతో రాజును ప్రజలు అభినందనల్లో ముంచెత్తు తున్నారు. ఆ విశేష మేమిటో మీరే చదివి తెలుసుకోండి….

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గంలోని మండల కేంద్రమైన యస్.రాయవరం నుండి పి.ధర్మవరం పోవు తారు రోడ్డును ఆనుకొని చిన్నమదుము వద్ద యలమంచిలి గ్రామ కాపురస్తుడు శ్రీ వేంకటేశ్వర ఫైనాన్స్ కర్రి ధనరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా హైటెన్షన్ విద్యుత్ లైన్ క్రిందన శ్రీ వెంకటేశ్వర నగర్ ప్రైవేట్ లేఔట్ లోని వ్యర్థపు నీరు తారురోడ్డు పైకి వదలి వేయడం జరుగుతున్నది. దీనితో రోడ్డు పాడడంతో పాటు, వీధి మొత్తం బురదగా మారడం, పాడడం, చుట్టుప్రక్కల గృహస్తులకు, చెడు వాసన, నిల్వ నీరు వలన దోమల బారినపడి రోగాల బారిన పడుతున్నట్లు చర్యలు తీసుకోవాలని తేది11.04.2021 న సోమిరెడ్డి రాజు, కన్వీనర్, యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ, యస్.రాయవరం మండలం సంబంధిత అధికారులకు వ్రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగినది. సoబందిత అధికారులైన, మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాహశీల్ధార్, పంచాయతీ కార్యదర్శి, యస్.రాయవరం కు పిర్యాదు చేయడంతో ఎట్టకేలకు స్పందించిన అధికారులు శ్రీ వెంకటేశ్వర నగర్ ప్రైవేట్ లేఔట్, యజమాని కర్రి ధనరెడ్డి ని వ్యర్థపు నీరు తారురోడ్డు పైకి వదల వద్దని, నిర్మాణ సామగ్రిని రోడ్డు పై వేయవద్దని, ఇకపై ఇటువంటి చర్యలు చేపడితే చట్ట ప్రకారం చర్యలు చేపడతామని ఎట్టకేలకు హెచ్చరించడంతో నీరు తారురోడ్డు పైకి వదలక పోవడంతోను, నిర్మాణ సామగ్రి ఇసుక తదితరాలు తీయడంతో రోడ్డు శుభ్రంగా ఉండడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిర్యాదుకు తక్షణం స్పందించి సమస్య పరిష్కారం చేసినందుకు సోమిరెడ్డి రాజు అధికారులకు ధన్యవాదములు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *