చెత్త సమస్యను తొలగించండి..

యస్.రాయవరం, 18 ఏప్రిల్ 2021
————————————————-
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం యస్.రాయవరం మండలం దార్లపూడిలో దార్లపూడి- ఏటికొప్పాక రెండు గ్రామాలను కలుపుతూ వరహా నదిపై నిర్మించిన వంతెన క్రింద ఊళ్ళోని చెత్తను బాధ్యతా రాహిత్యంగా వేసి డస్ట్ బిన్ గా చేశారు. అయితే కాలం తీరిన కూల్ డ్రింక్ పెట్ బాటిల్స్ ను భారీగా ఈ చెత్త పై వేయడం జరిగింది. దీని వలన ఏడాది కాలం దాటిన సీలు వేసిన బాటిల్స్ కావడంతో కూల్ డ్రింక్స్ కాబట్టి తెలియక చిన్న పిల్లలు కాని ఎవరైనా త్రాగితే అనారోగ్యం పాలవుతారన్న కనీస స్పృహ లేకుండా చేయడంతో ప్రమాదాన్ని గుర్తించి శుక్రవారం తెలిసిన వెంటనే సామాజిక బాధ్యతగా సోమిరెడ్డి రాజు, కన్వీనర్, యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ, యస్.రాయవరం మండలం, ఈ విషయాన్ని, సామాజిక మాద్యమాలలో వైరల్ చేయడంతో ఈ చెత్తను ఈరోజు శనివారం కాల్చి వేయడం జరుగుతున్నది. ఇప్పటికైనా కాలం తీరిన డ్రింక్ బాటిల్స్ బాధ్యతా రాహిత్యంగా వేసిన వ్యక్తులును గుర్తించి చర్యలు తీసు కోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *