* చర్చిలు, మసీదులు, దేవాలయాలకు నోటీసులు

శంఖవరం, 17 ఏప్రిల్  2021.

యావత్ ప్రజానీకం కరోనా నివారణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తూ శంఖవరం మండలం తాసిల్దారు కార్యాలయం మార్గదర్శక తాఖీదులను శనివారం జారీ చేసింది. ప్రతీ ఆదివారం క్రైస్తవుల చర్చిలు, మసీదుల్లో ప్రతీ రోజులో ఐదు సార్లు నమాజ్, ప్రతీ శుక్రవారం ప్రత్యేక “దుఆ” నిర్వహించే మసీదులు, త్వరలో శ్రీరామ నవమి నిర్వహించే శ్రీసీతారామ మందిర దేవాలయాలు, ప్రజల సామూహిక ప్రాంతాలు, దుకాణాలు, అంగడులలో దైనందిన కార్య కలాపాలు నిర్వహించే సందర్భాల్లోనూ ప్రజల విధిగా కరోనా నిబంధనలను పాటించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మండలంలోని గ్రామాల్లోని చర్చ్ పాస్టర్స్, మసీదులు, రామాలయాల వద్ద సమావేశాల్లో కోవిడ్ నిబంధనలు కఠినంగా పాటించాలని లేకపోతె కఠిన చర్యలు ఉంటాయని వ్రాత పూర్వకంగా హెచ్చరించారు. ముఖ్యంగా రంజాన్ నెల కాబట్టి మసీదులు, తదితర ఆలయాల వద్ద, శ్రీరామ నవమి పందిళ్ళకు కోవిడ్ నిబంధనలను పేర్కొంటూ అతి పెద్ద ఫ్లెక్సీలను ప్రదర్శించాలని ఆదేశించారు. ఎక్కువ మంది గుమిగూడి కూడదని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అంతే కాక కరోనా నిబంధనలు అమలులో గ్రామాల్లో పంచాయితీలు, సచివాలయాల అధికారులతో పాటు వీఆర్వోలు తగు రీతిలో నిర్బంధంగా నిబంధనలు అమలు చేయాలని, ఈ మేరకు సిబ్బందికి అవగాహన సమావేశాలను నిర్వహించాలని ఆదేశించామని శంఖవరం తాసిల్దారు కర్నాసుల సుబ్రహ్మణ్యం “మనం న్యూస్” కు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *