గుడివాడ, 18 ఏప్రిల్ 2021
—————————————–
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం యస్.రాయవరం మండలం, గుడివాడ గ్రామ రెవిన్యూ, గుర్రాజుపేట గ్రామ పంచాయతీ లో వ్యర్ధాల నుండి సంపద తయారీ కేoద్రం (SWPC) ఎదురుగా, గుర్రాజుపేట నుండి రేవుపోలవరం – అడ్డరోడ్డు మెయిన్ రోడ్డు పోవు తారు రోడ్డును ఆనుకొని, సర్వే నెంబర్ 131-3 ఉన్న ప్రభుత్వ భూమిని ఆనుకొని ఉన్న పంట కాలువ, తారు రోడ్డుకు మధ్యన ఉన్న త్రాగు నీటి బోరు పని చేయక పోవుట దేముడెరుగు నీరు కొట్టుకొనే హ్యాండిల్ లేకుండా ఉత్సవ విగ్రహంగా నిరుపయోగంగా, సంవత్సర కాలంగా ఉన్నా, సంబంధిత అధికారులు స్పoదించక పోవడం గ్రామస్తుల దురదుష్టo కాక మరేమిటి. త్రాగునీటి బోరు ద్వారా సంపద కేoద్రం, సమీపంలోని శెట్టిబలిజ కులస్తుల శ్మశానం వద్ద జరుగు సంప్రదాయ ఆచార వ్యవహారాల కార్యక్రమాలకు, అనంతరం చేయు స్నానాలకు, రహదారి వెంట వెళ్ళు వాహనదారులు, సమీప రైతులు, కూలీ పనులకు వెళ్ళు వ్యక్తులు, సమీపంలో ఉన్న సతైమ్మ తల్లి ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే త్రాగునీటి బోరు పట్ల పలు మార్లు పిర్యాదు చేసినా, సంబంధిత అధికారులు ఎవ్వరూ స్పందించక, బోరు బాగు చేయించి వినియోగంలోకి తేకపోవడం అధికారుల భాద్యతారాహిత్యానికి నిదర్శనంగా ఉంది. స్థానిక గ్రామస్తుడైన మునస గురువులు, యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ, యస్.రాయవరం యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డి రాజు పిర్యాదు చేసినా ఈనాటికీ చర్యలు చేపట్టకుండా మిన్నకుండి పోయారు. వేలాది రూపాయల ప్రభుత్వ ధనం వెచ్చించి వేసిన బోరు నిరుపయోగంగా ఉంది. బోరు వద్ద చెత్త వేస్తున్నారని ఫిర్యాదు చేయగా దానిపై చర్యలు తీసుకొని, బోరు సంగతి మరిచారు. ప్రజల పిర్యాదుల పట్ల అధికారుల స్పందన ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి వేసవిలో త్రాగునీటి బోరు వినియోగంలోకి తెచ్చి దాహార్తిని తీర్చాలని కోరుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *