గుడివాడ, 19 ఏప్రిల్ 2021
—————————————–
తాగు నీటి చేతి పంపు బాగు చేయండి మహా ప్రభో.. ! అన్న వార్తకు స్పందించి 24 గంటలు సమయం కూడా గడవక ముందే ఆ చేతి పంపును బాగు చేసి ప్రజల దాహార్తిని తీర్చి ఆదర్శంగా నిలిచారు ఆ అధికారులు. ఆ అధికారుల సహృదయానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపు తున్నారు. దీంతో ఈ సమస్యను వెలుగులోకి తెచ్చి సమస్య పరిష్కారానికి ప్రత్యక్షంగా కృషి చేసిన ఏకైక ప్రజా శ్రేయోభిలాషి, ఎస్.రాయవరం మండలం ఫోరం ఫర్ ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డి రాజు ఖాతాలో మరో విజయం జమయ్యంది.

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గం యస్.రాయవరం మండలం గుడివాడ గ్రామ రెవిన్యూ గుర్రాజుపేట గ్రామ పంచాయతీలో వ్యర్ధాల నుండి సంపద తయారీ కేంద్రం (SWPC) ఎదురుగా ఉన్న త్రాగునీటి బోరు పని చేయక సంవత్సర కాలంగా నిరుపయోగంగా ఉన్నదని సంబంధిత అధికారులు స్పందించి వినియోగం లోనికి తేవాలని యస్.రాయవరం మండలం యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డి రాజు అధికారులకు ఆదివారం ఫిర్యాదు చేసారు. దీనితో తక్షణం స్పందించిన గ్రామీణ రక్షిత తాగు నీటి సరఫరా విభాగం (రూరల్ వాటర్ సప్లై స్కీం – RWS) అధికారులు సోమవారం ఉదయంమే 60 అడుగులు లోతుకు తవ్వి, పాత పైపులు, హెడ్ ను తొలగించి, పాత వాటి స్థానే నూతన పైపులు, పంపు హెడ్ అమర్చారు. ఫలితంగా తాగు నీరు పుష్కలంగా వస్తోంది. ఏడాదిగా నిరుపయోగంగా ఉన్న తాగు నీటి బోరును వినియోగంలోకి తేవడంతో గ్రామస్తులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిర్యాదుపై వెంటనే స్పందించి మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తెచ్చి నందుకు అధికారులకు సొమిరెడ్డి రాజు ధన్యవాదములు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *