చినగుమ్ములూరు, 19 ఏప్రిల్ 2021
——————————————————-
ఈ ఆర్అండ్బీ భవనాలు భూత్ బంగళాలుగా మారాయి. ఒకప్పుడు ఎందరో మహానుభావులకు ఒకప్పుడు విశ్రాంతిని, ఆశ్రయాన్ని ఎంతో ప్రాభవం పొందిన ఈ విశ్రాంతి భవనాలు ఆక్రమణల చెరలో చిక్కు కున్నాయి. వివరాల్లోకి వెళితే …

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గం యస్.రాయవరం మండలం చినగుమ్ములూరు గ్రామ పంచాయతీ పరిధిలోని, అడ్డరోడ్డు తిమ్మాపురం నేషనల్ హైవే నుండి నర్సీపట్నం, నర్సీపట్నం రైల్వే స్టేషన్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగువన ఉన్న ప్రభుత్వ రహదారులు భవనాల శాఖ (ఆర్&బి) విశ్రాంతి భవనాలు ఎందరో ప్రముఖులకు విశ్రాంతి నిచ్చి ఏంతో ప్రాభవం కలిగిన ఈ భవనాలు నేడు భూతాల బంగళాలుగా మారడం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి సాక్షీ భూతంగా నిలుస్తున్నవి. చినగుమ్ములూరు రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్ 247 పూరా విస్తీర్ణం ఎకరాలు7.43 సెంట్లు లో 247-22 లో ఎకరాలు 1.54 సెంట్లు భూమిలో బ్రిటిష్ వారి కాలంలో నిర్మించిన రెండు భవనాలు ఉన్న ఈ విశ్రాంతి భవనాలు ఒకనాడు ఎందరో మహానుభావులకు విశ్రాంతి ఇచ్చినా, నేడు ప్రభుత్వం, అధికారుల, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వలన శిథిలావస్థకు చేరుకొని, భూ అక్రమార్కుల కన్ను పడి, ఆక్రమణలకు గురయ్యింది. గత వైభవాలకు ఆనవాళ్లు మాత్రం మిగిలినట్లుగా చెప్పవచ్చు. యస్.రాయవరం మండలంలో ఉన్న ఏకైక ఈ విశ్రాంత భవనాలు అప్పటి బ్రిటిష్ అధికారులు నిర్మించినట్లు, బ్రిటీష్ అధికారులు ఎందరో ఇక్కడ విశ్రాంతిని పొందినట్లు నాటి తరం పెద్దలు కథలు, కథలుగా చెప్పేవారని గ్రామస్తులు చెబుతున్నారు. అప్పటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రమ్మానందరెడ్డి వంటి మహామహులు నుండి తంగేడుకు చెందిన రాజులందరూ ఇక్కడ విశ్రాంతి తీసుకున్న వారే. ఏజెన్సీ ముఖద్వారం అయిన నర్సీపట్నం నుండి వచ్చి ఇక్కడకు విశ్రాoతి తీసుకొని దూరప్రాంతాలకు ఇక్కడ నుండి రైళ్లు ద్వారా ప్రయాణాలు చేసేవారని తెలుస్తున్నది.

ఫ్లైఓవర్ దిగిన తరువాత చినగుమ్ములూరు గ్రామం ప్రారంభంలో తారురోడ్డును ఆనుకొని ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్లైఓవర్ వేయక ముందు ఉన్న అప్పటి తారురోడ్డు అనుకొని, తూర్పు వైపున, రైల్వే ట్రాక్ వరకు ఈ భూమి ఆక్రమించి ఉన్నది. కాలమయిమ వల్ల స్థలమైనా, మనిషి అయినా ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయన్న పెద్దలు తెలిపే నానుడి ప్రకారం నాడు ఎంతో ప్రఖ్యాత విశ్రాoత భవనాలు గా పేరుగాంచిన ఈ భవనాలు నేడు అసాoఘిక కార్యకలాపాలకు, యాచకుల గంజాయి కేoద్రం గాను, పశువులశాలు గాను, వ్యాపారస్తుల, భూఅక్రమార్కుల తాటాకు కమ్మల వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తున్నారు. కోట్ల విలువైన ఈ భూమిపై కన్నుపడిన రాజకీయ నాయకులు, భూఅక్రమార్కులు ఒక ప్రక్క అక్రమించుకుంటూ, కుచింపచేస్తున్నా, సంబంధిత అధికారులుగాని, ప్రజాప్రతినిధులు గాని చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం. ఇదే గ్రామానికి చెందిన కోసూరి చిన్నంనాయుడు సమితి అధ్యక్షుడు గా ఉన్నప్పుడు ఎక్కువగా ఈ భవనాలను ఎక్కువగా వాడుకున్నట్లు చెబుతున్నారు. అదే విధంగా కాకర నూకరాజు 3 పర్యాయాలు, పాయక రావుపేట ఎమ్మెల్యే గాను, ఈయన కుమార్తె కాకర పద్మావతి యస్.రాయవరం ఎం.పి.పి గానూ పనిచేసారు. రెవిన్యూ శాఖ ఫైనల్ గెజిట్ 22A ప్రకారం సర్వే నెంబర్ 247-22 ప్రభుత్వ భూమి LF Banglow గాను, 1బిలో ప్రభుత్వ భూమి గాను, అడంగల్ లో ప్రభుత్వ మిగులు భూమిగా చూపడంలో మతలబు ఏంటో రెవెన్యూ శాఖ అధికారులు సమాధానం చెప్ప వలసి ఉన్నది. కోట్ల విలువ చేసే ఈ భూమిని భూబకాసురులకు అన్యాక్రాంతం చేయడానికే ప్రభుత్వ మిగులు భూమిగా ముందు జాగ్రత్తగా చూపారా అన్న వ్యాఖ్యానాలు వినపడు తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రెవిన్యూ అధికారులు, ఆర్ అండ్ బి అధికారుల సమక్షంలో జాయింట్ సర్వే చేసి నాటి కాలపు చరిత్రకు ఆనవాళ్లుగా అభివృద్ది చేయాలని యస్.రాయవరం మండలం యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ.కన్వీనర్ సోమిరెడ్డి రాజు కోరుతూ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *