హైదరాబాద్‌, 20 ఏప్రిల్‌ 2021 :
——————————————-
ఉభయ తెలుగు భాషా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల ఉమ్మడి తెలుగు పాత్రికేయ దిగ్గజం, హైదరాబాద్ నేల తల్లి ముద్దు బిడ్డ, మహోన్నత ఆదర్శ వాది, తోటి విలేకరులకు ఆదర్శ పాత్రికేయులు, కలం యోధులు అమర్ నాధ్ కరోనా రక్కసికి కారణంగా పరమపదించ్రారు. కరోనా రక్కసి నుంచి తన రాతలు, మాటలతో వివిధ మాధ్యమాల ద్వారా ఎందరినో అప్రమత్తం చేసిన ఆయన చివరకు ఆ కరోనాకే బలవ్వడం యాదృచ్ఛికం. ఈ సీనియర్‌ జర్నలిస్ట్‌ అమర్‌నాథ్‌ మంగళవారం కరోనా చికిత్స కోసం పది రోజుల కిందట నిమ్స్‌లో చేరి చికిత్స తీసుకుంటూ మంగళవారం మరణించారు. అమర్ నాథ్ అంత్యక్రియలు బుధవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్తానంలో నిర్వహిస్తారు. ఆంధ్రభూమి దిన పత్రికలో అమర్‌నాథ్‌ చాలా ఏళ్ళ పాటు పనిచేశారు. జర్నలిస్టు యూనియన్‌లో వివిధ హోదాల్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశారు. అమర్‌నాథ్‌ మృతికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర, రెండు రాష్ట్రాల్లోని జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *