శంఖవరం, ఏప్రిల్ 20, మనం న్యూస్ ;

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో రోజూ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా పాఠశాశాల మూసివేత నేపధ్యంలో ప్రైవేట్ బడుల సిబ్బందిని ప్రభుత్వమే ఆదుకోవాలని సిబ్బంది కోరుతున్నారు. అకస్మాత్తుగా పాఠశాలను మూసివేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించటంతో ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది భవిష్యత్తు అగమ్యగోచర మైందని సిబ్బంది ఆవేదన చెందారు. బడుల మూసివేతతో చిన్న బడ్జెట్ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వీరిని ప్రభుత్వమే ఆదుకోవాలని శంఖవరం మండల ప్రైవేటు స్కూల్ యూనియన్ సభ్యులు ప్రభుత్వాన్ని కొరారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం శంఖవరంలోని లిటిల్ రోజస్ ప్రైవేటు పాఠశాలలో మండల ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయ సిబ్బంది మంగళవారం సమావేశమై తీర్మానించారు.

ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు కోలా చంద్ర రావు, కార్యదర్శి యండమూరి వెంకట్రావు, కోశాధికారి సయ్యద్ హుస్సేన్ వరుసగా మాట్లాడుతూ గత సంవత్సరం కరోనా వలన మార్చి 18వ తేదీన అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన కారణానంగా అప్పటికే 50 -70% ఫీజులు వసూలు కాక చిన్న బడ్జెట్ ప్రైవేట్ విద్యా సంస్థలు తీవ్రమైన నష్టాల్లోకి కూరు కుపోయాయని, అటు తర్వాత రమారమి 11 నెలలు స్కూలు నడవని కారణంగా ప్రైవేటు విద్యా సంస్థలకు విపరీతమైన ఆర్థిక నష్టం ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది జీతాలు లేక కుదేలైన పరిస్థితి అందరికీ తెలిసినదేనని ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అకస్మాత్తుగా విద్యా సంవత్సరాన్ని ప్రకటిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థల గూర్చిన కనీస ఆలోచన లేకుండా స్కూళ్లను ప్రారంభించాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వగా, అప్పటికే తీవ్ర ఆర్థిక నష్టంలో ఉన్న స్కూల్ లో కేంద్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో పెట్టిన నిబంధనలను పాటిస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అప్పులు చేసి పాఠశాలలను తెరిచాం. దేశ వ్యాప్తంగా, కనీసం పక్క రాష్ట్రాలలో కూడా స్కూలు తెరవక పోగా, మన పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో స్కూలు తెరిచి మళ్ళీ వెంటనే మూసి వేయడం వల్ల మన రాష్ట్రంలో కూడా ఎప్పుడు స్కూలు మూసి వేస్తారో అని, అనవసరంగా మనం ఫీజులు ఎందుకు కట్టాలి అనే ఆలోచనతో చిన్న చిన్న స్కూళ్ళలో అతి తక్కువ ఫీజులు పెట్టినా కూడా కట్టకుండా ఇప్పటి వరకు తల్లిదండ్రులు జాప్యం చేసారని. ఇప్పుడు మళ్ళీ అకస్మాత్తుగా స్కూల్ మూసి వేయాలి అని ప్రభుత్వ ఆలోచన వలన రావలసిన అనేక ఫీజులు రాక మూలుగుతున్న నక్క మీద తాటి పండు పడ్డట్టు అయ్యిందని ఇదివరకే ఆర్థికంగా పతనం చెందిన ప్రైవేట్ విద్యా సంస్థలను, అందులో పనిచేసే ప్రైవేట్ ఉపాధ్యాయులు, డ్రైవర్లు, ఆయాలు, వాచ్ మెన్ల వంటి సిబ్బందిని ఈ పరిస్థితిలో ప్రభుత్వమే ఆర్థికంగా ఆదుకోవాలని శంఖవరం మండల ప్రైవేటు పాఠశాలల ఐక్య వేదిక నుంచి స్థానిక పాఠశాల కరస్పాండెంట్లు అందరూ అభిప్రాయ పడ్డారు.

రాష్ట్రంలో రమారమి 15,500 ప్రైవేట్ పాఠశాలలు ఉంటే అందులో 11,000 పైగా విద్యావంతులైన నిరుద్యోగ కుటుంబాలచే స్థాపించబడి, నడిపించ బడుతున్న చిన్న బడ్జెట్ పాఠశాలలు ఉన్నాయని. వాటిని నమ్ముకుని లక్షలాది మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పని చేస్తున్నారని, గత ఏడాది తగిలిన కరోనా దెబ్బకు రాష్ట్రంలో దాదాపు 40 మంది కరస్పాండెంట్ లు ఆర్థికంగా పతనమై మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మ హత్యలు, హఠాన్మ రణాలకు గురికావలసి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అనేక మంది చిన్న చిన్న బడ్జెట్ పాఠశాలల కరస్పాండెంట్ ల బ్రతుకులు రోడ్డున పడినట్లు అయిందని. కనుక ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పాఠశాలలను మూసి వేయడాన్ని అర్థం చేసుకో గలిగినా ఇంత మంది ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది మనుగడను ఏ విధంగా కొనసాగించాలో తెలియని అయోమయ పరిస్థితిలో ప్రభుత్వానికి మనవి చేస్తున్నా అన్నారు. రాష్ట్రంలో చిన్న చిన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలో యాజమాన్యాలకు ఎంతో కొంత నష్టపరిహారం చేయూతగా ఆర్థిక సహాయం చేస్తూ, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, ఆయాలకు, డ్రైవర్లకు, వాచ్ మాన్ లకు కనీసం నెలకు రూ. 5000 లు నిరుద్యోగ భృతిని కల్పించి ఆదుకోవాల్సిందిగా మనవి చేస్తున్నామని. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉన్నదని, అలాంటప్పుడు సమాజంలో అతి ప్రాముఖ్యమైన విద్యావ్యవస్థలో కీలక పాత్ర వహిస్తున్న చిన్న బడ్జెట్ ప్రైవేట్ విద్యా సంస్థలను, అందులో పనిచేసే సిబ్బందిని కూడా సమాజంలోను, వ్యవస్థలోను భాగస్వాములుగా గుర్తించి, వారికి కూడా చేయూతను ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో బి వరప్రసాద్, బి. రామారావు, యస్ గోవిందు, వై కుమారి, మిగతా  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *