ఎస్.జగ్గంపేట , 22 ఏప్రిల్  2021

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలంలోని ఎస్.జగ్గంపేట గ్రామంలోని పంచాయతన శ్రీసీతారామ చంద్రమూర్తి, సీతాదేవి కళ్యాణం బుధవారం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అనువంశీకులు మోగంటి కుటుంబీకులు ఆధ్వర్యంలో జరిగింది. రాజమండ్రికి చెందిన కొచ్చర్లకోట రామకృష్ణ, శిరీష దంపతుల సౌజన్యంతో వారి ఆధ్వర్యంలో శ్రీసీతారాముల దివ్యకల్యిణాన్ని అభిజిత్ లగ్నంలో ఉదయం 9 -11 గంటల మధ్యలో స్వామి, అమ్మ వార్ల దివ్య  కళ్యాణం మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా, వైభవంగా
యాజ్ఞీకులు మొక్కరాల సతీష్ శర్మ జరిపారు. కళ్యాణాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రోత్సాహకులు మోగంటి మురళీకృష్ణ ఆలయాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించారు. కోవిడ్ నేపథ్యంలో ఏకాంతంగా స్వామి, అమ్మవార్ల కళ్యాణం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భ్రమరాంబ దంపతులు, కొండెపూడి ప్రసాద్, రంగా వీరబాబు, బొండా జగదీష్, కీర్తి వరహాలు, నడిగట్ల అప్పలస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *