ఒంటిమిట్ట, 2021 ఏప్రిల్ 23
—————————————
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్‌ఆర్ కడప జిల్లా కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఉన్న ఒంటిమిట్ట మండల కేంద్రం ఒంటిమిట్టలోని పుణ్యక్షేత్రం కోదండ రామాలయం ప్రాచీనమైన, విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడి మూల మూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడివడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ఈ ఆలయమున్న ఒంటిమిట్ట ఆంధ్రా భద్రాచలంగా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ఈ ఆలయానికి సమర్పిస్తారు.

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడ‌వ‌‌ రోజు శుక్ర‌వారం రాత్రి  సింహ వాహ‌నంపై స్వామివారు  సీతా, లక్ష్మణ సమేతంగా ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న ‌సేవ నిర్వ‌హించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహా ధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహ దర్శనం’ అతి ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యం అవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను సంహరించడంలో నేను, నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనం ద్వారా స్వామి వారు తెలియ జేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్ వెంక‌టేశ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ధ‌నంజ‌యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *