* వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కింద నగదు జమ చేసిన సీఎం వైయస్‌ జగన్‌ 
* పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మల సున్నా వడ్డీ నగదు జమ
* వరుసగా రెండో ఏడాది డ్వాక్రా సంఘాల రుణాలకు వడ్డీ చెల్లింపు
* 1.02 కోట్ల మందికి పైగా అక్కాచెల్లెమ్మలకు లబ్ధి
* డ్వాక్రా సంఘాల అప్పుపై ఈ ఏడాది వడ్డీ రూ.1109 కోట్లు చెల్లింపు
* ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయస్‌ జగన్‌
* గత ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలను మోసం చేసింది
* మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నాం

తాడేపల్లి, 23 ఏప్రిల్ 2021
—————————————-
మహిళా సాధికారత అన్నది మా నినాదం కాదని..అది మా విధానమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునర్ఘుటించారు.  కోవిడ్‌ కష్ట కాలంలో రాష్ట్రం ఆదాయం సరిగా లేకపోయినా ఇచ్చిన మాట కోసం అక్కా చెల్లెమ్మలకు అండగా నిలబడ్డామని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు.  మహిళా సాధాకారతను ఆచరణలోకి తీసుకురాగలిగామని పేర్కొన్నారు.

పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు సున్నా వడ్డీ సొమ్ము వరుసగా రెండో ఏడాది కూడా అంద జేస్తున్నామని చెప్పారు. రెండో ఏడాది డ్వాక్రా సంఘాలపై ఈ ఏడాది వడ్డీ రూ.1109 కోట్లు చెల్లింపులు చేస్తున్నామని ప్రకటించారు. ఈ పథకం ద్వారా కోటి రెండు లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ వర్చువల్‌ విధానంలో పొదుపు సంఘాల మహిళలతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ముఖ్యమంత్రి మాటల్లోనే..

ఈ రోజు మంచి కార్యక్రమం దేవుడి దయతో 9.34 లక్షల స్వయం సహాయక సంఘాల పరిధిలోని 1.02 కోట్ల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరిగించే కార్యక్రమం దేవుడు నా ద్వారా జరిగించడం సంతోషంగా ఉంది. దేవుడికి రుణపడి ఉంటాను.  సమాజంలో అక్క చెల్లెమ్మలకు బాగుంటునే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.

అన్ని రంగాల్లో మహిళల ఎదుగుదలే వారికి రక్ష
సమాజంలో మానవ హక్కులు అమలు అవుతున్నాయా? స్వేచ్చా, స్వాంతంత్య్రాలు ఉన్నాయా? ఏ సమాజంలో అయితే పూర్తిగా అక్కాచెల్లెమ్మలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు ఉంటాయో ఆ సమాజం అన్ని రకాల మానవ హక్కులు, స్వేచ్చ, స్వాతంత్య్రం, సమానత్వం బాగున్నట్లే. ఈ సిద్ధాంతాన్ని చాలా గట్టిగా నమ్ముతున్నాను. గత 23 నెలలుగా ఇదే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాం. అక్కా చెల్లెమ్మ లకు అండగా నిలబడ్డాం. అన్ని రంగాల్లో వారి ఎదుగుదలే ఈ తరానికి ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టే వచ్చే తరానికి రక్ష అని బలంగా నమ్మాం కాబట్టే ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. మహిళా సాధికారత అన్నది ఒక నినాదంగా కాకుండా ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టే ప్రతి అడుగులోనూ అదే కనిపిస్తుంది. గర్భంలోని శిశువు నుంచి పండు వృద్ధుల వరకు  అందరికి కూడా అన్ని అందేలా సామాజికంగా, ఆర్థికంగా, విద్య, వైద్యం అందిస్తున్నాం. మహిళా సాధికారితకను ఆచరణలోకి తీసుకురాగలిగాం.

ఎన్ని కష్టాలు ఉన్నా.. వరుసగా రెండో ఏడాది
గత  ఆర్థిక సంవత్సరం 2020–2021లో పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలు పొదుపు సంఘాల ద్వారా తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించడంతో మన ప్రభుత్వం వరసగా రెండో ఏడాది కూడా సున్నా వడ్డీ వర్తింజేస్తున్నాం. కోటి రెండు లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చేలా ఈ రోజు 9.34 లక్షల స్వయం సహాయక సంఘాలకు ప్రయోజనం  చేకూర్చేలా రూ.1109 కోట్లు బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నాం. మనది అక్కా చెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అక్కా చెల్లెమ్మల పొదుపు సంఘాలు 2019 ఏప్రిల్‌ నాటికి 8.71 లక్షలు ఉండగా కోవిడ్‌ సమయంలోనూ వీటిసంఖ్యను 60 వేల గ్రూపులకు పెంచగలిగాం. 9.36 లక్షల సంఘాలకు పెంచాం.

మహిళా సాధికారత కోసం ఎంతగా కట్టుబడి ఉందో అందరికి అవగతమైంది. కోవిడ్‌ కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం బాగా తగ్గిపోయినా కూడా పొదుపు సంఘాలకు ఇచ్చిన మాట కోసం వైయస్‌ఆర్‌ ఆసరా ద్వారా 6, 00,796 కోట్లు మహిళల చేతుల్లో పెట్టాం. 2019–2020లో ఆర్థిక సంవత్సరంలో సున్నా వడ్డీ చెల్లింపులతో డ్వాక్రా సంఘాల్లో పెరుగుదల కనిపిస్తోంది.

గత ప్రభుత్వం డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అప్పటి దాకా ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసింది. సున్నా వడ్డీ పథకం ఆగిపోవడం, చెప్పిన మాట నెరవేర్చ కుండా చంద్రబాబు మోసం చేయడంతో గ్రేడ్లు పడి పోయాయి. అప్పులపాలై వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక మూత పడ్డాయి. అక్కా చెల్లెమ్మలకు అప్పట్లో దాదాపు రూ.3 వేల కోట్ల పైచిలుకు వడ్డీ రాయితీలు కోల్పోవాల్సిన పరిస్థితిని చూశాం. అందుకు భిన్నంగా మనందరి ప్రభుత్వం రాష్ట్రంలో 8.71 లక్షల గ్రూపుల్లోని 88 లక్షల పొదుపు మహిలకు బాసటగా  తొలి ఏడాదిలోనే వారి రుణాలకు వడ్డీగా రూ.1400 కోట్లు చెల్లించాం. వారి ఖాతాల్లోనే జమ చేశాం. మాట ఇచ్చిన ప్రకారం మొదటి విడత సరా సొమ్ము   రూ.6792 కోట్లు కూడా ఇచ్చాం. ఆ ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించమని అక్కా చెల్లెమ్మలకు మనవి చేస్తున్నాను.

స్వయం సంఘాలు రూ.3 లక్షల లోపు బ్యాంకు రుణాలకు బ్యాంకులు 12.5 శాతం వడ్డీలు వసూలు చేశాయి. మనం అధికారంలోకి వచ్చిన తరువాత బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాన్ని 9.5 తగ్గించాం. దీనివల్ల రూ.590 కోట్లు భారం తగ్గించాం. స్వయం సహాయక సంఘాలను నిలబెట్టేందుకు, వడ్డీ భారాన్ని తగ్గించేందుకు రెండో విడతగా రూ.1109 కోట్లు చెల్లిస్తున్నాం.

వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటి వరకు మహిళలకు మ‌న‌ ప్రభుత్వం అందించిన లబ్ధి
1.జగనన్న అమ్మ ఒడి
మహిళా లబ్ధిదారుల సంఖ్య 44,48,865
లబ్ధి రూ.13,022.90 కోట్లు
2.వైఎస్ఆర్ కాపు నేస్తం
మహిళా అబ్ధిదారుల సంఖ్య 3,27,862
లబ్ది రూ.491.79 కోట్లు
3.వైఎస్ఆర్‌ చేయూత
మహిళా లబ్ధిదారుల సంఖ్య 24,55,534
లబ్ది 4,604.13 కోట్లు
4.వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ (మహిళలు)
లబ్ధిదారుల సంఖ్య 1,02,00,000
అక్కా చెల్లెమ్మ‌ల‌కు లబ్ది రూ.2,509.08 కోట్లు
5.వైఎస్ఆర్‌ నేతన్న నేస్తం
లబ్ధిదారుల సంఖ్య 81,703
లబ్ధి రూ.383.79 కోట్లు
6.వైఎస్ఆర్‌ ఆసరా
లబ్దిదారుల సంఖ్య 87,74,674
లబ్ధి రూ.6,792.21 కోట్లు
7.వైఎస్ఆర్‌ బీమా లబ్ధిదారుల సంఖ్య
17,03,703
లబ్ధిరూ. 176.22 కోట్లు
8.వైఎస్‌ఆర్‌ పెన్షన్ కానుక
లబ్ధిదారుల సంఖ్య 36,72,831
లబ్ది 16,444.18 కోట్లు
9.వైఎస్ఆర్‌ రైతు భరోసా
లబ్ధిదారుల సంఖ్య 17,27,249
లబ్ధి రూ. 3,567.10 కోట్లు
10.మత్స్యకార భరోసా
లబ్ధిదారుల సంఖ్య 2,294
లబ్ధి రూ.4.58 కోట్లు
11.జగనన్న వసతి దీవెన
లబ్ధిదారుల సంఖ్య 15,56,965
లబ్ధి రూ.1220.99 కోట్లు
12.జగనన్న విద్యా దీవెన
లబ్దిదారులు సంఖ్య 9,79,414
లబ్ది రూ.2,477.89 కోట్లు
13.వైఎస్‌ఆర్ వాహన మిత్ర
లబ్ధిదారుల సంఖ్య 24,188
లబ్ధి రూ.45.69 కోట్లు
14.లా నేస్తం
లబ్ధిదారుల సంఖ్య 721
లబ్ధి రూ.3.24 కోట్లు
15.జగనన్న చేదోడు
(రజకులు, దర్జీలు, నాయీబ్రాహ్మణులు)
లబ్ధిదారుల సంఖ్య 1,36,340
లబ్ధి రూ.136.34 కోట్లు
16. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా
లబ్ధిదారుల సంఖ్య 93,851
లబ్ధి రూ.50.66 కోట్లు
17.జగనన్న గోరు ముద్ద
లబ్దిదారుల సంఖ్య 18,20,196
లబ్ధి రూ.415.34 కోట్లు
18.వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ
లబ్ధిదారుల సంఖ్య 30,16,000
లబ్ధి రూ.1,863.13 కోట్లు
19.వైఎస్‌ఆర్‌ జగనన్న ఇళ్ల పట్టాలు
(భూసేకరణ వ్యయం)
లబ్ధిదారుల సంఖ్య 30,76,000
లబ్ధి రూ.27,000.00 కోట్లు
20.వైఎస్ఆర్‌ ఆరోగ్య శ్రీ
లబ్ధిదారుల సంఖ్య 2,73,241
లబ్ధి రూ.824.44 కోట్లు
21. జగనన్న విద్యా కానుక
లబ్ధిదారుల సంఖ్య 21,86,972
లబ్ధి రూ.334.61 కోట్లు

దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా మహిళలకు 50 శాతం నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చేలా చట్టం చేశాం. గ్రామ మున్సిపాలిటీల్లో 61 శాతం పదవులు మహిళలకే ఇచ్చాం. మహిళల భద్రత విషయంలో రాజీ పడదలేదు. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశాం. పోలీసు స్టేషన్లలో మహిళా సహాయక డెస్క్‌లు ఏర్పాటు చేశాం. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాం. వార్డు సచివాలయల్లో కూడా మహిళా పోలీసులను నియమించాం. ప్రతీ స్కూల్లో బాలికల సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 43 వేల బెల్టుషాపులు మూసివేయించాం. 4,300 పర్మిట్‌ రూమ్‌లు కూడా రద్దు చేశాం. రాత్రి 8 గంటలు దాటితే మద్యం షాపులు మూసి వేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతోంది. మద్యం రేట్లు పెంచాం. మద్యం అమ్మకాలు తగ్గించగలిగాం. ప్రతి అడుగు కూడా మద్య నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నాం అని ప్రతి అక్కకు చెల్లెమ్మకు సగర్వంగా చెబు తున్నాను. 21వ శతాబ్ధపు ఆధునిక భారత మహిళ మన రాష్ట్రంలోనే రూపుదిద్దుకుంటుందని సగర్వంగా చెబుతున్నాను. ప్రతి పాప చదువుల పరంగా కనీసం గ్రాడ్యుయేట్‌ కావాలి. ప్రతీ అక్కా చెల్లెమ్మ ఆర్థికంగా లక్షాధికారిణి కావాలి. ప్రతి మహిళా ఇంటి బయట గౌరవప్రదంగా, పూర్తి రక్షణతో జీవించే పరిస్థితులు మనం ఉమ్మడిగా కల్పించాలి. జండర్‌ పరంగా ఉన్న అసమానతలు తొలగాలి.ఆర్థిక స్వావలంబనతో ప్రారంభమయ్యే వారి ప్రయాణం సామాజికంగానూ , రాజకీయం గానూ వారిని గొప్పగా నిలబెట్టే పరిస్థితులు రావాలి. ఇవన్నీ కూడా దేవుడి దయతో చేయగ    తానని సంపూర్ణమైన నమ్మకం ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి దయ మనందరి ప్రభుత్వంపై ఉండాలని, మీ అందరికి ఇంకా మంచి చేసే పరిస్థితి దేవుడు నాకు ఇవ్వాలని మనసారా ఆశీస్సులు కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని చెపుతూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *