* ఆర్థిక సాయం దుర్వినియోగం వద్దు
* సాయంతో ఆర్ధిక స్వావలంబన సాధించండి
* మహిళలకు శంఖవరం ఎంపీడీవో పిలుపు

శంఖవరం, 23 ఏప్రిల్ 2021
—————————————–
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతీ మహిళా లక్షాధికారి కావాలనేది ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి లక్ష్యం అని శంఖవరం ఎంపీడీవో. జె.రాంబాబు పిలుపు ఇచ్చారు. ఆ లక్ష్య సాధన దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీద 9.35 లక్షల మహిళా సంఘాల సభ్యుల బ్యాంకుల పొదుపు ఖాతాల్లో బ్యాంకు రుణాల వడ్డీ రాయితీ పధకంలో భాగంగా రూ.11.09  కోట్లను శుక్రవారం ప్రభుత్వం అంతర్జాలం ద్వారా జమ చేసింది అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో వైఎస్సార్ క్రాంతి పథం జీరో వడ్డీ రుణాలు అందించే కార్యక్రమాన్ని ఎంపీడీవో. రాంబాబు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో. రాంబాబు మాట్లాడుతూ ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా మొత్తం మీద 87,357 మహిళా సంఘాలకు రూ. 52,35,33,319 లను, ప్రత్తిపాడు నియోజక వర్గం మొత్తం మీద 5048 మహిళా సంఘాలకు రూ.2,82,53,864 లను, శంఖవరం మండలం లోని 1,293 మహిళా సంఘాల్లోని సభ్యుల ఖాతాల్లోకి రూ. 70,36,921లను ప్రభుత్వం జమ చేసిందని వెల్లడించారు. ఈవిధంగా ప్రభుత్వం దఫదఫాలుగా అందిస్తున్న ఆర్థిక సహయాన్ని దుర్వినియోగం చేయవద్దని పిలుపు ఇచ్చారు. ఈ వడ్డీ రాయితీ సాయంతో మహిళలు వివిధ కుటీర పరిశ్రమలు, చేతి వృత్తు పనుల్లో పెట్టుబడి పెట్టి వచ్చే ఆదాయంతో ఆర్ధిక స్వావలంబన సాధించాలని సూచించారు. అలాగే 45 సంవత్సరాలు పైబడిన మహిళలకు చేయూత పధకంలో ఏటా రూ. 18,000 చొప్పున మూడేళ్ల పాటు అందించే సహాయంలో ఇప్పటికే మొదటి విడత సొమ్ములను అందించామని అన్నారు. త్వరలో రెండో విడత సొమ్ములను కూడా అందిస్తామని వీటిని కిరాణా వంటి ఇతరత్రా స్వయం ఉపాధి పథకాల్లో సద్వినియోగం చేసుకొని, ప్రతీ మహిళా ఆర్ధిక స్వావలంబన సాధించాలని శంఖవరం ఎంపీడీవో జె.రాంబాబు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాబోయే శంఖవరం ఎంపిపి పర్వత రాజుబాబు, వైయస్సార్ క్రాంతి పధం పధకం ఏపియం. జి.వి. ప్రసాద్, కత్తిపూడి సిసి. సీత, శంఖవరం సిసి. నాగమణి, గ్రామ సంఘాల నాయకా మణులు, సిబ్బంది హాజరు అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *