* దీన్నీ బొలిశెట్టి గోవింద్ బొక్కేశాడు
* చేపల చెరువునూ కబ్జా చేసాడు
* మూల్యం చెల్లిస్తోన్న పంచాయితీ

ఎస్.రాయవరం, 26 ఏప్రిల్ 2021
———————————————
బొలిశెట్టి గోవిందు అక్రమాలు, ఆక్రమణలు, నిధుల స్వాహా, ప్రభుత్వ నిబంధనల అతిక్రమణలు, అవినీతికి అంతూ దరీ లేనే లేదు. తవ్వేకొద్దీ అనంతసాగరంలా అవి బయట పడుతూనే ఉన్నాయి. అందులో తాజాగా వెలుగు చూసిన అనంతసాగరం చేపల చెరువు అద్దె సొమ్ములు రూ. 4,36,000 స్వాహా పర్వం ఒకటి.

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గంలోని మండల కేంద్రం యస్.రాయవరం గ్రామ రెవిన్యూ పరిధిలో యస్.రాయవరం నుండి పులపర్తి గ్రామానికి వెళ్ళే తారు రోడ్డును ఆనుకొని గూండ్రిబిల్లి గ్రామ సరిహద్దులో సర్వే నెంబర్ 54 లో ఎకరాలు 42.59 ఎకరాల గర్భంతో అనంతసాగరం చెరువు ఉంది. ఈ చెరువు నీటిపై ఆధారపడి 257 ఎకరాల ఆయకట్టు వ్యవసాయ సాగు భూమి ఉంది. ఏటేటా మత్స్యకారులకు అద్దెకు ఇచ్చే ఈ చెరువు స్థానిక పంచాయితీ అధికారుల అసమర్ధత వల్ల చెరువు నిర్వహణను కాస్తా క్రమేణా మాజీ ఎంపిటిసి సభ్యులు, అధికార పార్టీ నేత బొలిశెట్టి గోవిందరావు తన రాజకీయ కబంద హస్తాల్లోకి లాగేసు కున్నారు. ఫలితంగా 2017-2018, 2018-2019, 2019-2020 మూడు సంవత్సరములు యస్.రాయవరం కు చెందిన జోగేష్, పులపర్తి గ్రామస్తుడు నూకరాజు, అడ్డు రోడ్డు తిమ్మాపురం గ్రామస్తుడు సత్తిబాబులకు 2017-2018 లో రూ. 70,000, 2018-2019 రూ. 80,000, 2019-2020 రూ. 1,00,000 చొప్పున ఈ మూడు సంవత్సరాలలో మొత్తం రూ. 2,50,000/- చెరువులో చేపల పెంపకం కొరకు ఏ ఏడాదికి, ఆ ఏడాది ప్రారంభంలోనే ప్రభుత్వ, పంచాయతీల నిబంధనలను తలతన్ని ఎటువంటి బహిరంగ వేలాన్ని నిర్వహించకుండా మాజీ ఎంపిటిసి శ్రీ బొలిశెట్టి గోవిందరావు తన అనుచరులకు, నచ్చిన వారికి ఇవ్వడం, వారి నుండి అద్దె నగదును వసూళ్లు చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా నాలుగు ఏళ్ల సొమ్ము మొత్తం రూ. 4,36,000 స్వాహా చేసారు.

ఇంత జరిగినా బొలిశెట్టితో కుమ్మక్కు అయిన పంచాయితీ అధికారులు బొలిశెట్టిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనితో మరింత బరి తెగించిన బొలిశెట్టి 2020-2021, 2021-2022 రెండు సంవత్సరాలకు రూ 3,72,000 లకు ఎలమంచిలికి చెoదిన ఆళ్ల శ్రీనివాసరావుకు అద్దెకు ఇవ్వగా, ఇతడు యస్.రాయవరం గ్రామస్తుడు అడ్డురి రమణకు ఇచ్చి ఇతడు మొదటి సంవత్సరం నకు రూ.1,86,000 లు తీసుకొని తన జేబులో వేసుకున్నారు. గత కొన్ని ఏళ్ల నుండి ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీకి చెల్లించకుండా స్వాహా చేస్తున్న బొలిశెట్టి గోవిందరావు, ఇతనితో కుమ్మక్కు అయిన సంబంధిత అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకొని, స్వాహా చేసిన సొమ్ములను వడ్ఢితో సహా రాబట్టి గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయాలని యస్. రాయవరం మండలం యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డి రాజు విశాఖ జిల్లా కలెక్టర్ కు, 16.03.2020 న లోకాయుక్తకు Lr Dis No.154/2020/B2/LOK/2334/2020.ఫిర్యాదు చేశారు. చూస్తూ ఊరుకున్నందుకు బొలిశెట్టి అక్రమాలకు స్థానిక పంచాయితీ మూల్యం చెల్లిస్తోన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *