* సచివాలయాలపై ఇక రెవెన్యూ పెత్తనం

శంఖవరం, 26 ఏప్రిల్ 2021 (జనాసవార్త) ;

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగులకు జీత భత్యాలు చెల్లింపులు (డిడిఓ) విధులు మొదలుకొని అన్ని అధికారాలను స్ధానిక వీఆర్వోలకు కట్టబెడుతూ గ్రామ సచివాలయాల శాఖ ఇటీవల జీవో నంబర్‌ 02 జారీ చేసిన నేపథ్యంలో ఇక వీఆర్వోలు అందరూ ఆయా సచివాలయాల పాలనా భాధ్యతలను స్వీకరించాలని శంఖవరం ఎంపీడీవో. జె.రాంబాబు ఆదేశించారు. అలాగే ప్రభుత్వం ఆదేశించిన విధంగా పంచాయితీలకు సంబంధించిన అన్ని దస్త్రాలను, విధులను వీఆర్వోలకు అప్పగించాలని పంచాయితీ కార్యదర్శులను ఎంపీడీవో ఆదేశించారు. అదే మాదిరిగా అందరు వీఆర్వోలూ తమ కార్యదర్శుల నుంచి ఆయా సచివాలయాల బాధ్యతలను స్వీకరించి, విధుల్లో చేరి, ఆ మేరకు తాము సచివాలయాల పరిపాలనా బాధ్యతలను స్వీకరించినట్టు సంబంధిత నివేదికలు తనకు సమర్పించాలని ఎంపీడీవో వీఆర్వోలను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని మండలం కేంద్రమైన శంఖవరంలోని ఎంపీడీవో.కార్యాలయంలో 14 పంచాయితీలు, 16 సచివాలయాల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు,  గ్రామ రెవిన్యూ అధికారులకు శంఖవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి జె.రాంబాబు సమీక్షా సమ్వయ సమావేశాన్ని మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ప్రభుత్వం జారీ చేసిన జి.వో నెం.02 ప్రకారం సంబందిత గ్రామ రెవిన్యూ అధికారులు ఆయా సచివాలయాల పరిధిలోని వాలంటీర్లతో సమన్వయమై అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు పంచాయితీ కార్యదర్శులు నిర్వహించిన అన్ని ప్రభుత్వ విధులను ఇకపై వీఆర్వోలే నిర్వహించాలని ఆదేశించారు. వీఆర్వోలు అందరూ సంబందిత పంచాయతీ కార్యదర్శులతో సమన్వయమై త్వరిత గతిన నివేదికల  తనకు సమర్పిస్తే వాటిని ఉన్నత అధికారులకు తాను సమర్పించాలని సూచించారు. ఉన్నత అధికారులు ఏదేని విధుల గురించి గ్రూపు, ఫోన్ సందేశాలు పంపిన వెంటనే వీఆర్వోలు తగిన విధంగా స్పందించాలని, ఏవైనా సమావేశాల నిమిత్తం ప్రభుత్వం, అధికారులు సందేశాలు పంపిన వెంటనే సదరు సమావేశాలకు వీఆర్వోలు అందరూ విధిగా హాజరు కావాలని . వీఆర్వోలకు ఎంపీడీవో దిశానిర్దేశం చేస్తూ సచివాలయ పాలనా విధానాన్ని, ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. ఈ సమావేశంలో ఈఓపీఆర్డీ.కెవివియస్ కాశీవిశ్వనాధం   పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *