తాడేపల్లి, 26 ఏప్రిల్ 2021
——————————————
విలయ తాండవం చేస్తున్న వేళ మహమ్మారి
కరోనా నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని కట్టు దిట్టమైన చర్యలను తీసు కుంటోంది. ఇకపై రాష్ట్రంలో ఏ వేడుకకైనా 50 మందికే అనుమతి ఇస్తామని వైద్య అరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సోమవారం వెల్లడించారు. క్రీడా ప్రాంగణాలు, జిమ్‌లు. ఈత కొలనులను తాత్కాలికంగా మూసి వేయాలని ఆయన ఆదేశించారు. 50 శాతం సామర్థ్యంతోనే ప్రజా రవాణా, సినిమాహాళ్లకు అనుమతిస్తున్నట్లు ఆయన చెప్పారు. అన్ని కార్యాలయాల్లోనూ సిబ్బంది తమ విధి నిర్వహణలో వారి మధ్య 50 గజాల దూరం పాటించాలని సింఘాల్‌ కోరారు. ఒకే కాల్‌సెంటర్‌ ద్వారా ఆస్పత్రుల్లో పడకల కేటాయింపు, అడ్మిషన్లు జరగాలన్నారు. రెమ్‌డెసివిర్‌ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 11,000 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ వయల్స్‌ ను అందుబాటులో ఉంచామని ఆయన వెల్లడించారు. రాష్ట్రానికి 341 టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించిందని, అది సరిపోవడం లేదని, మెడికల్‌ ఆక్సిజన్‌ వినియోగాన్ని పర్యవేక్షిస్తామనీ, చాలా చోట్ల ఆక్సిజన్‌ వృథా అవుతోందని, అవసరం లేకపోయినా ఆక్సిజన్‌ వాడుతున్నారు’’ అని అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *