యస్.రాయవరం, 27 ఏప్రిల్ 2021
————————————————
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం మండలం కేంద్రం  యస్.రాయవరంలో వర్షం నీరు పోయే దారే లేదు. సానిక కోపరేటివ్ బ్యాంకు రోడ్డు, మద్దాల వీధి, చర్చ్ రోడ్డులో వర్షం నీళ్ళు పోయే కాలువలు లేక నీరు నిల్వ ఉంటున్నది. ఫలితంగా వివిధ వాహనాలు ఈ రోడ్డులో వెళ్ళినప్పుడు అవి బురద నీటిని పాదచారులపై ఎగజిమ్ము తున్నాయి. బాధితులు వాహనాలను దూషించు కోవడం ఇక్కడ సర్వ సాధారణంగా మారింది. బ్యాంక్, జలవనరుల శాఖ కార్యాలయాలకు, దిగువ నున్న లింగరాజుపాలెం, కర్రివానిపాలెం, పిట్లపాలెం, బసాపాడు, వెంకటాపురం గ్రామస్తులు అందరూ ఈ బురద నీటిలోనే పావనమై ప్రయాణం చెయ్యవలసినదే. గతంలో ఈ మెయిన్ రోడ్డుకు, సైడ్ డ్రయిన్స్ నిర్మించాలని సోమిరెడ్డి రాజు (కన్వీనర్, యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ, యస్.రాయవరం మండలం), మద్దాల అప్పారావు, వాసం గోవిందు తదితరులు గ్రామ సభలో వ్రాత పూర్వకoగా పిర్యాదు ఇవ్వడం జరిగినా, సంబంధిత అధికారులు స్పందించలేదు.  అంతేగాక గ్రామానికి మంజూరైన ఆరు రోడ్లను బొలిశెట్టి గోవిందరావుకుమార్ చెందిన స్వంత లేఔట్లు, వెంకటేశ్వర స్వామి గుడి వద్ద 3 ఇళ్లకు 4 రోడ్లు, తహశీల్దార్ కార్యాలయం వెనుక లేఔట్ కు ఒక రోడ్డు, తన అనుచరుడు యల్లపు నాగు ఉన్న 4 ఇళ్ళు కొరకు, గ్రామస్తుల ప్రాణాలను పణంగా పెట్టి వరహానది ఏటి గట్టును తొలగించి రోడ్డు వేయడానికి పూనుకోగా ఫిర్యాదులతో 4 రోడ్లు డ్రైయిన్ వేయకుండా ఆపేసారు. నాయకుడు అడుగులకు అధికారులు ముడుగు లొత్తడం, నాయకుడికి అనుకూలంగా వ్యవహరించడం ఇక్కడ  ప్రజల దౌర్భాగ్యంగా మారింది. ఇప్పటికీ దీనిపై హైదరాబాద్ లోకాయుక్తలో కేసు నడుస్తున్నది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు, నాయకులు స్పందించి మెయిన్ రోడ్డుకు డ్రైయిన్లు నిర్మించి ప్రజల కష్టాలను తీర్చాలని సోమిరెడ్డి రాజు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *