కాకినాడ గ్రామీణం, 28 ఏప్రిల్ 2021
————————————————-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరోనా నివారణ నిధికీ తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నుంచి వెలువడుతున్న “ఎర్రబాట” తెలుగు దినపత్రిక సంపాదకులు పితాని వెంకట రాము రూ.3,000 లను విరాళంగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయశాఖా మాత్యులు కురసాల కన్నబాబును కాకినాడ గ్రామీఅణంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసిన పితాని సంబంధిత చెక్ ను బుధవారం అందజేశారు. సిఎం సహాయ నిధికి ఓ సీనియర్ పాత్రికేయునిగా తన వంతు సాయంగా అందజేయాలని మంత్రిని పితాని కోరారు. క‌రోనా మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లను ప్రభుత్వం తీసుకుంటున్న‌ కృషిలో భాగంగా పితాని వెంకట రాము అందించిన ఆర్థిక సాయానికి మత్రి అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *