దార్లపూడి, 29 ఏప్రిల్ 2021.
——————————————
అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న జె.సి.బి 200 ను, 5 టిప్పర్లను ఎస్.రాయవరం పోలీసులు బుధవారం ఉదయం సీజ్ చేశారు. .విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం,
ఎస్.రాయవరం మండలం పోలవరం పోలవరం కాలువ నుండి నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్న నేరంపై పోలీసులు ఈ చర్చలు తీసుకున్నారు. అడ్డు రోడ్డు జాతీయ రహదారి వద్ద వంతెనను నిర్మిస్తున్న కాంట్రాక్టర్ సుమారు 1000 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ను తరలించుకు పోవడానికీ ప్రభుత్వం అనుమతి తీసుకున్నారు. కానీ నిజానికి కొన్ని వేల క్యూబిక్ మీటర్లు మట్టిని అక్రమంగా దోచుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. గత 20 రోజుల నుండి అనదికారికంగా గ్రావెల్ తరలిస్తున్న అక్రమార్కులపై దార్లపూడి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కోన బాబురావు స్థానిక పోలీసులకు, సంబంధిత శాఖ అధికారులకు పలు మార్లు పిర్యాదు చేసారు. నామ మాత్రపు చలానా చెల్లించి, దాని కంటే అదనంగా 20 రెట్లు గ్రావెల్ తరలించారని బాబురావు ఉన్నత అధికారులకు తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎస్.రాయవరం ఎస్.ఐ వి.చక్రధరరావు తమ సిబ్బందితో రంగంలోకి దిగి గ్రావెల్ తరలించేందుకు పోలవరం కాలువ వద్ద సిద్ధంగా ఉన్న 5 టిప్పర్లను, జె.సి.బి 200 ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దీనిపై సంబంధిత అధికారులకు నివేదిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *