యస్.రాయవరం, 29 ఏప్రిల్ 2021
————————————————
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గం మండల కేoద్రం యస్.రాయవరంలోని శ్రీ వెంకటేశ్వర నగర్ లేఔట్ లోని వ్యర్దపు నీటిని సర్వసిద్ది పంట కాలువలోకి పంపడానికి స్థానిక వేంకటేశ్వరస్వామి గుడి వద్ద ఉన్న చిన్న మదుము వద్ద మెయిన్ రోడ్డును తవ్వేస్తున్నారు.
రహదారులు భవనాల శాఖ, జల వనరుల శాఖ, పోలీస్ శాఖ, గ్రామ పంచాయతీల నుంచి ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తారు రోడ్డును ద్వంసం చేస్తున్నారు. తారు రోడ్డును ద్వoశం చేయడానికి 29.04.2021 ఉదయం పనులు ప్రారంబించారు. పట్ట పగలు అందరూ వాహన చదకులు, పాదచారులు, అధికారులు అందరూ చూస్తూ వెళుతుండగా రద్దీగా ఉన్న సమయంలో కనీస స్పృహ, సామాజిక బాధ్యత లేకుండా, తారు రోడ్డు అడుగున్నర, రెండు అడుగులు వెడల్పు, 30 అడుగుల పొడవునా త్రవ్వకాలను యజమాని కర్రి ధనరెడ్డి దగ్గర ఉండి పనులు చేయిస్తున్నాడు. అందువల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి, రోడ్డు అక్రమ తవ్వకందారుడైన కర్రి ధనరెడ్డిపై తక్షణం చట్టం ప్రకారం చర్యలు తీసుకుని, రోడ్డు ధ్వంసాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కు
యస్.రాయవరం మండలం యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డి రాజు పిర్యాదు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *