* మాస్క్ ధరించకుంటే రూ.100 జరిమానా
* కరోనాపై విస్తృత మైక్ ప్రచారం

శంఖవరం, 01 మే 2021
————————————-
కరోనా రెండో దశ తీవ్ర ప్రభావం చూపుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు అందరూ కరోనా నివారణా నిబంధనలను విధిగా పాటించేలా వారికి అవగాహన కల్పించాలని శంఖవరం ఎంపీడీవో. జె.రాంబాబు తన సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం అధికార యంత్రంగం హెచ్చరించిన తరువాత కూడా కరోనా నిబంధనలు పాటించని వారిని, ఖాతరు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై పోలీసు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన తన సిబ్బందిని ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని అందరు పంచాయితీ కార్యదర్శులు, వీఆర్వోలు, పచివాలయాల సిబ్బందిని ఉద్దేశించి ఎంపీడీవో రాంబాబు వాట్సాప్ సందేశం ద్వారా శనివారం ఈ ఆదేశాలను జారీ చేసారు. కరోనా నివారణా అవగాహనపై ప్రజలను మరింత అప్రమత్తం చేసేందుకు మండలం వ్యాప్తంగా పంచాయితీలు, మండల పరిషత్తు సమన్వయంతో గ్రామాల్లో
విస్తృతంగా వాహన మైక్ ప్రచారాన్ని నిర్వహిస్తు ఉన్నామని, ఈ ప్రచారం కావలసిన చోటల్లా గ్రామ స్థాయి అధికారులే దగ్గర ఉండి నిర్వహించు కోవాలన్నారు. ప్రభుత్వ నిర్దేశించిన సమయాల్లో తప్ప మిగతా సమయాల్లో ఆరు బయట జన సంచారం లేకుండాను, గుంపుల జన సంచారాన్ని అరికట్టాలని, ప్రజలు అందరూ విధిగా మాస్క్ లు ధరించేలా చూడాలని, మాస్క్ ధరించని వారి నుంచి రూ.100 అపరాధ రుసుముగా వసూలు చేసి అందుకు ప్రతిగా వారికి మాస్క్ లను అధికారులే ఇవ్వాలని ఎంపీడీవో ఆదేశించారు. ఇంత చేసిన తరువాత కూడా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి అధికారుల సూచనలను ఖాతరు చేయకుండా ధిక్కార శైలిలో ఇష్టానుసారం ప్రవర్తిస్తూ కరోనా వ్యాప్తికి కారణం అవుతున్న వారిపై అవసరమైతే పోలీసు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన తన సిబ్బందిని ఆదేశించారు. ఈ విధంగా కొందరిపైనైనా కేసులు నమోదు ఐతే మిగతా వారిలో మార్పు రావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనా నివారణా ప్రచార వాహనాన్ని స్థానిక మండల పరిషత్తు కార్యాలయం ప్రాంగణంలో ఎంపీడీవో. రాంబాబు సిబ్బంది సమక్షంలో ప్రారంభించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *