అన్నవరం, 2 మే 2021
————————————
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం అన్నవరం వర్కింగ్ జర్నలిస్ట్ అసోనియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది. పాత కార్యవర్గానికి రెండు సంవత్సరాలు కాల వ్యవధి పూర్తైన సందర్భంగా అసోసియేషన్ మెజారిటీ సభ్యుల ఆమోదంతో ఈ ఎన్నిక జరిగింది. అసోసియేషన్ నూతన
అధ్యక్షులుగా సత్తి బాలకృష్ణ మూర్తి (విశాలాంధ్ర), ఉపాధ్యక్షులుగా పడాల నాగేశ్వర రావు (ఆంధ్ర న్యూస్), కార్యదర్శిగా జొన్నాడ రాజేష్ (వార్త), సహాయ కార్యదర్శిగా రాజాన రాజేష్ (ఏక్ట్ న్యూస్), కోశాధికారిగా కుక్క శివప్రసాద్ (మహా న్యూస్), సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా చిందిరాల భానుమూర్తి (టీవీ 7 న్యూస్), కార్యవర్గం సభ్యులుగా ఎం. లోకేష్ (సివిఆర్ న్యూస్), డి.ఏసుబాబు (మెట్ట జ్యోతి), వై. శ్రీనివాస్ (ఎస్డీఎస్ న్యూస్), జి. శ్రీనివాస్ (జి న్యూస్,) ఎస్.మణికంఠ( ప్రజాజ్వాల) ను ఎన్నుకున్నారు. మసమావేశం అనంతరం కార్యవర్గ సభ్యులను పూల మాలతో సత్కరించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బాలకృష్ణమూర్తి మాట్లాడుతూ సమాజంలో పాత్రికేయుల గౌరవం పెంచేలా చేస్తూ విలేఖర్లకు అండగా ఉంటానని, వారి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *