నల్గొండ, 2 మే 2021
——————————
ప్రత్యక్ష రాజకీయాలకు కాంగ్రెస్ నేత జానారెడ్డి గుడ్ బై చెప్పారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత జానారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన గౌరవం కోసం నాగార్జున సాగర్‌లో పోటీ చేసినట్లు జానారెడ్డి తెలిపారు. ధర్మంతో, ప్రజాస్వామ్య విలువలతో ఎన్నికల్లో పాల్గొన్నాన న్నారు. ఒక కొత్త ఒరవడిని తెద్దామని చేసిన విజ్ఞప్తిని పార్టీలు పట్టించు కోలేదని చెప్పారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని లేదని తెలిపారు. తన వారసుడిని పోటీకి పెట్టాలో లేదో అధిష్టానం నిర్ణయిస్తుందని జానారెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *