యస్.రాయవరం, 3 మే 2021
—————————————–
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని మండల కేoద్రం యస్.రాయవరం గ్రామ పంచాయతీ 4 వ వార్డులో సింగన నాగేశ్వరరావు ఇంటి వద్ద ఉన్న త్రాగు నీటి చేతి పంపు నిరూపయోగoగా పడి ఉన్నది. దీనికి హెడ్ భాగం, నీరు కొట్టే హ్యాండిల్ లేవు. ఇదిలా సంవత్సర కాలంగా
నిరుపయోగంగా పడి ఉన్నప్పటికీ పంచాయతీ అధికారులు, గ్రామీణ రక్షిత తాగు నీటి సరఫరా విభాగం అధికారులు, గ్రామ నాయకులు, సచివాలయ వాలంటీర్లు పట్టించు కోనేలేదు. అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే త్రాగు నీటి బోరు పట్ల పలు మార్లు పిర్యాదు చేసినా అధికారులు ఎవ్వరూ స్పందించలేదు. బోరును బాగు చేయించి వినియోగంలోకి తేకపోవడం అధికారుల భాద్యతారాహిత్యానికి అద్దం పడుతోంది. ప్రస్తుత నూతన పంచాయతీ పాలక వర్గం కూడా ఈ సమస్యపై దృష్టి సారించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంపును భాగు చేయించి, ఈ వేసవిలోనే త్రాగు నీటి బోరును వినియోగంలోకి తేవాలని,ప్రజల దాహార్తిని తీర్చాలని సోమిరెడ్డి రాజు (కన్వీనర్, యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ, యస్.రాయవరం మండలం), 13 వ వార్డు సభ్యుడు గాలి సత్యనారాయణ, దుబాసి రమేష్, కర్రి శ్రీనివాసరావు అధికారులనూ కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *