* అధికారుల బృందం నిబద్ధత
* కరోనాపై అవగాహనే లక్ష్యం

శంఖవరం, 04 మే 2021
————————————-
ప్రజల్లో కరోనా నివారణ అవగాహన కొరకు ప్రభుత్వ నిబంధనలను ఆ అధికారులు ఖచ్చితంగా పాటించారు. మాస్కులు ధరించకుండా సంచరించే వారిని వెంబడించి వారి ముక్కు పిండి మరీ అపరాధ రుసుములను విధించారు. అంతేకాదు మండుటెండను సైతం ఖాతరు చేయకుండా నడి రోడ్డు పైనే వారికి ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని
మండల కేంద్రం శంఖవరం గ్రామంలో ప్రభుత్వ ఉత్తర్వులు, ఎంపీడీవో. జె.రాంబాబు ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి సీహెచ్. శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది అంతా బృందంగా ఏర్పడి కరోనా నిబంధనలను పాటీంచకుండా దారిన పోయే వారిని కరోనా అవగాహన దారిలోకి తెచ్చే ప్రయత్నాన్ని విజయవంతం చేసారు. గ్రామంలోని ప్రధాన రహదా కూడలిలో పంచాయతీ సిబ్బంది అంతా పర్యటించి ఈ ప్రధాన రహదారిలో వెళ్లే పాదచారులు, మోటార్ సైకిళ్ళు, కారు, ఆటో, లారీ వంటి వాహన చోదకుల్లోనూ మాస్కులు ధరించని వారిని అటకాయించి ఒక్కొక్కరి నుంచి రూ. 100 చొప్పున 25 మంది నుంచి రూ. 2,500 లను జరిమానాగా విధించి వసూలు చేయడమే గాకుండా వారందరికీ మాస్కులను అందజేశారు. కరోనా మొదటి దశ కంటే రెండవ దశ చాలా ప్రమాదకర మైనదని, ప్రజలందరూ విధిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, గుంపులుగా సంచరించ వద్దని వారికి అవగాహన కల్పించారు. ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదని, బ్రతికి ఉంటే ఏదైనా సాధించవచ్చని, కరోనాని అంత మొందించాలంటే ముందుగా ప్రజలలో మార్పు రావాలని, 45 సంవత్సరాలు నిండిన వారందరూ ముందుగా వ్యాక్సిన్ వేయించు కోవాలని, ప్రజల్లో కరోనా పట్ల అవగాహన కల్పించి, మార్పు తేవడమే ప్రభుత్వ లక్ష్యమని కార్యదర్శి సీహెచ్. శ్రీరామచంద్రమూర్తి, మిగతా సిబ్బంది హితబోధ చేసారు. విఆర్ఓ సీతారాం, పంచాయతీ కార్యదర్శి శంకరా చార్యులు, జూనియర్ అసిస్టెంట్ రమణ మూర్తి, వలంటీర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *