park n fly san francisco discount coupon statue of liberty was gifted to usa by which country pak21 coupon code strange xmas gifts metro zoo coupons miami drop down coupon app

అగ్రహారం, 7 మే 2021
——————————–
ఆ గ్రామంలో నాలుగు రోజులుగా తాగు నీరు లేదు. ఉన్న ఏకైక త్రాగు నీటి బోరు మోటారు పాడైంది. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గంలోని మండల కేoద్రం యస్.రాయవరం గ్రామ పంచాయతీ అగ్రహారం గ్రామంలో ఉన్న ఏకైక త్రాగునీటి బోరు మోటారు పాడవడంతో వేసవి కాలం అయినందున, త్రాగు నీరు లేక నాలుగు రోజుల నుండి ప్రజలు అల్లాడు తున్నారు. త్వరగా తాగు నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శి ఏ.వి.యస్.యస్.ప్రసాద్ కు ఈ నెల ఐదో తేదీన తేదీన అగ్రహారం గ్రామస్తుల తరుపున సోమిరెడ్డి రాజు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం లోగా బోరుకు మోటార్ ను బిగించి సమస్యను పరిష్కరిస్తానని శుక్రవారం కార్యదర్శి ప్రసాద్ హామి ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *