* తుప్పు పడుతున్న సైకిళ్ళు
* పట్టించుకోని ప్రభుత్వం

యస్.రాయవరం, 7 మే 2021
—————————————–
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గంలోని మండల కేంద్రం యస్.రాయవరం మండలంలోని అర్హులైన వికలాంగులకు అందజేసేందుకు పది నెలల క్రితం తెచ్చిన మూడు చక్రాల సైకిళ్ళు యస్.రాయవరంలోనీ
రెల్లివీధిలోని రైతు భరోసా కేoద్రంలో కుప్పలుగా పడున్నాయి. గత ఏడాది ఆగస్టు మెదటి వారం ప్రాంతంలో 80 మూడు చక్రాల సైకిళ్ళను (విడి భాగాలను) వికలాంగులకు పంపిణీకి తెచ్చారు. ఈ విడి భాగాలను సైకిల్స్ గా బిగించి అర్హులైన వికలాంగులకు అందజేయ వలసి ఉండగా వాటిని రైతు భరోసా కేoద్రంలోను, మిగిలినవి ఆరు బయట ఖాళీ స్థలంలోను ఏ రక్షణ లేకుండా పడేశారు. అవి ఎండకు ఎండి, వానకు తడుస్తూ పాడవుతున్నాయి. గానీ సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. అవి తు
తుప్పు బట్టి నిరుపయోగంగా మారుతున్నాయి.
10 నెలల కాలంగా ఇక్కడ వీటి పరిస్థితి ఇలానే ఉంది. ఈ విధంగా లక్షలాది రూపాయల ప్రజా ధనం నిరుపయోగంగా మారుతున్నందున వాటిని సైకిల్స్ గా అమర్చి అర్హులకు పంపిణీకి చేసి పధకం లక్ష్యం నెరవేరడానికి, వికలాంగులకు ప్రయోజనం చేకూర్చేందుకు అధికారులు, నాయకులు తక్షణం చర్యలు తీసుకోవాలని యస్.రాయవరం మండలం యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కన్వీనర్ సొమిరెడ్డి రాజు కోరుతూ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *