కత్తిపూడి పంచాయితీలో డి.ఎల్.పీ.ఓ. విచారణ

* సమగ్ర తనిఖీకి దస్త్రాల స్వాధీనం

శంఖవరం, 08 మే 2021
———————————-
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి పంచాయితీలో పెద్దాపురం డివిజనల్ పంచాయితీ అధికారిణి అమ్మాజీ శనివారం విచారణ చేపట్టారు. శంఖవరం మండల ప్రజా పరిషత్తు అభివృద్ధి అధికారి జె.రాంబాబుపై కత్తిపూడి సచివాలయం 1 కార్యదర్శి కాకరపర్తి బులివీరన్న తొలి రోజు మీడియా ముఖంగా పలు ఆరోపణలు చేశారు. అందుకు ప్రతిగా మలిరోజు రాంబాబు కూడా బులివీరన్నపై పలు ఆరోపణలు చేశారు. మూడో రోజు బులివీరన్నపై కత్తిపూడి పంచాయితీ సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ కూడా ఆరోపిస్తూ ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన లేఖను , ఆ లేఖా విషయాలనే ప్రస్తావిస్తున్న వీడియోను ఓ విలేఖరి మీడియాకు బహిర్గతం చేశారు. సర్పంచ్ ఆరోపణల సమాచారం ఆ మరుసటి రోజు పత్రికా, ప్రచార మాధ్యమాల్లో రచ్చ రచ్చ అయ్యింది. ఈ నేపధ్యంలో రెండో శనివారం అయినప్పటికీ ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ వివిధ అంశాలపై డీఎల్పీఓ. విచారణ చేసారు. ఈ విచారణ ముగిసేంత వరకూ సర్పంచ్, ఎంపీడీవో సచివాలయంలోనే అందుబాటులో ఉన్నారు. వారి నుండి రాత పూర్వకంగా వాంగ్మూలాలను తీసుకోవడం తోపాటు తదనంతర సమగ్ర పరిశీలనకు పంపంచాయితీలోని కొన్ని దస్త్రాలను డిఎల్పీఓ. అమ్మాజీ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో శంఖవరం మండలం ఈవోపీఆర్డీ విశ్వనాధం కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *