sixt car rental coupons spain 7 eleven big gulp coupon silly gift ideas for girlfriend ideas for baby shower gifts for mom kid crafts for gifts take 5 oil change raleigh coupon

పి.గన్నవరం, 9 మే 2021
————————————
కరోనా టీకాల ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాలను పాటించకుండా, అందుకు విరుద్దంగా టీకాల పంపిణీని నిర్వహించి నందుకు తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండల ప్రజా పరిషత్ అభివృద్ది అధికారి కె.వెంకటేశ్వరరావును  జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసారు. ఆదివారం మండలంలో ప్రజలకు టీకాలు రెండవ డోస్ పంపిణీని నిర్వహించాలని జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా వెంకటేశ్వర రావు మొదటి డోస్ వేసేందుకు189 టోకెన్లు ఇచ్చి పూర్తి చేశారు. ఆ సమయంలో పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు టీకాల కోసం వచ్చారు. ఆయన తీసుకున్న తర్వాత బంధువులకు మొదటి డోస్ వేయమని ఒత్తిడి చేశారు. అందుకు ప్రభుత్వ నిబంధనలు ఒప్పు కోవని కొద్ది సేపు నచ్చ చెప్పిన ఎంపీడిఒ చివరకు ఎమ్మెల్యే చిట్టిబాబు వత్తిడితో ఆయన బందు గణానికి టీకాల మొదటి డోస్ వేసి స్వామి భక్తిని చాటుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ దర్యాప్తుకు ఆదేశించి విషయాన్ని కలెక్టర్ కు నివేదించారు. ఆ వెంటనే ఎంపీడిఒ వెంకటేశ్వర రావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *