* ముందుకొచ్చిన దాత ఐ.ఇ.కుమార్

కొత్తపేట., 12 మే 2021
————————————-
కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్నారు. అట్టి బాధితులకు సాయం అందించేందుకు కొందరు దాతలు ముందుకు వస్తున్నారు. ఆ కోవలోనే తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ఆర్యవైశ్య సంఘ సభ్యుడు యండూరి పవన్ కుమార్ అధ్వర్యంలో ఏరియా ఆసుపత్రికి ఆక్సిజన్ సిలెండర్లు ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మరింత మంది దాతలు భాగస్వాములు అవుతున్నారు. ఊబలంక అన్నా మినిస్ట్రీస్ నిర్వాహకుడు, కాకినాడ జిల్లా పరిషత్ ఉద్యోగి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలురు పాఠశాల పూర్వపు విద్యార్థి  ఇసుకపట్ల ఇమ్మానియేల్ కుమార్ ఈ ఆక్సిజన్ దాన ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నారు. కొత్తపేట ఏరియా ఆసుపత్రికి ప్రతి రోజూ ఎంత ఆక్సిజన్ అవసరమైతే అంత ఆక్సిజన్ కొనుగోలు చేసేందుకు అవసరమయ్యే మొత్తాన్ని అందించేందుకు ఆయన ముందుకు వచ్చారు. మానవత్వంతో ముందుకు వచ్చిన కుమార్ ను ఆర్యవైశ్య సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *