ఎస్.రాయవరం, 12 మే 2021
———————————————-
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గం మండల కేoద్రం ఎస్.రాయవరం తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు అధికంశెట్టి జగన్నాథరావు (73) బుధవారం 2.15 సమయంలో మరణించారు. విశాఖ పట్నంలో సిద్దార్ధ నర్సింగ్ హాస్పిటల్లో హృద్రోగానికి వైద్య చికిత్స పొందుతూ మరణించారు. అధికంశెట్టి శ్రీరాములు ముగ్గురు కుమారులలో రెండో సంతానం జగన్నాదరావు. ఈయనకు
భార్య సత్యన్నారాయణమ్మ , అన్నయ్య ఈశ్వరరావు, తమ్ముడు బాబ్జి, ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. జగన్నాథరావు
కుమారుడు రఘురామచంద్రమూర్తి, ఇద్దరు కుమార్తెలు పావని (అల్లుడు రామచంద్ర), కృష్ణవేణి (అల్లుడు రమేష్) ఉన్నారు.
వ్యవసాయ కుటుంబముకు చెందిన జగన్నాథరావు కుటుంబ సభ్యులు అందరూ టీడీపీ ప్రారంభం నుండి ఇప్పటి వరకూ పార్టీలో ముఖ్య నాయకులుగా కొనసాగు తున్నారు. గతంలో జగన్నాదరావు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఒక పర్యాయం సర్పంచ్ గాను, ఒక పర్యాయం ఎంపిటిసి ఎన్నికలలో పోటీచేసారు. ప్రస్తుత కరోనా పరిస్థితులు వలన విశాఖపట్నం జ్ఞానాపురం శ్మశాన వాటికలో ఈరోజు సాయంత్రం అత్యక్రియలు పూర్తి చేసినట్లు కుటుంబ సభ్యులు రామకృష్ణ తెలిపారు. గ్రామ పార్టీ జగన్నాథరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *