యస్.రాయవరం, 14 మే 2021
———————————————
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని మండల కేoద్రం యస్.రాయవరంలో ప్రభుత్వ పౌరసరఫరా సరుకుల పంపిణీలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇంటింటికి వ్యాన్ లో బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా రెల్లి వీధిలో ప్రస్తుత కోవిడ్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తు ఉన్నారు. మాస్క్ లు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా పంపిణీ చేస్తున్నారు. అసలే  కోవిడ్ వల్ల ప్రజలు మృత్యు వాత పడు తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని, వీధిల్లోకి వెళ్లి ఇంటింటికీ వెళ్ళి సరుకులను పంపిణీ చేయవలసి ఉండగా వీధి మొత్తం లబ్దిదారులు అందరికీ ప్రాథమిక పాఠశాల ఒక్క చోటనే బియ్యం పంపిణీ చేస్తున్నారు. అందువల్ల  సంబంధిత అధికారులు స్పందించి నిబంధనల ప్రకారం ప్రజా పంపిణీ సరుకులను అందించేటట్లు చర్యలు తీసుకోవాలని మిగతా ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *