సర్వసిద్ది, 14 మే 2021
———————————–
విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం
యస్.రాయవరం మండలం సర్వసిద్ది గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నివారణా టీకాలను వేయాలని యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డి రాజు ప్రభుత్వాన్ని శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. అలాగే ఇక్కడ కరోనా నివారణా టీకాల కేంద్రాన్ని నిరవధికంగా కొనసాగించాలని ఆయన కోరారు. రెండు రోజుల క్రితం వరకు సర్వసిద్ది పి.హెచ్.సి లో వ్యాక్సిన్ వేసార. అయితే ప్రభుత్వo ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పెనుగొల్లు పి.హెచ్.సి లో మాత్రమే వ్యాక్సిన్ వేస్తుoడడంతో సర్వసిద్ది పరిసర ప్రాంతాల ప్రజలు రానూ… పోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన వెల్లడించారు. పూర్వ కాలం నుండి సర్వసిద్ది పి.హెచ్.సి పరిధిలో జె.వి.పాలెం, జంగులూరు, వేమగిరి, సైతారుపేట, సూదిపురం, వాకపాడు, వాతాడ, బంగారమ్మపాలెం, ఉప్పరాపల్లి, వెంకటాపురం, కర్రివానిపాలెం, పిట్లపాలెం, లింగరాజుపాలెం, యస్.రాయవరం తదితర గ్రామాలు ఉన్నాయని ఆయన చెప్పారు. సర్వసిద్ది ప్రభుత్వాస్పత్రలొ టీకాలు వేస్తే ఈ గ్రామాల్లోన ప్రజలందరకీ ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పెనుగొల్లు పి.హెచ్.సిలో మాత్రమే వ్యాక్సిన్ వేయడంతో మండల పరిధిలోని సుమారు 20 గ్రామాల ప్రజలు వీరికి సుదూర ప్రాంతమైన పెనుగొల్లు వెల్లవలసి రావడమే కాక, ప్రస్తుత కరోనా నిబంధనల వలన రవాణా సదుపాయాలు సక్రమంగా అందుబాటులో లేక అనేక ఇబ్బదులు పడుతున్నారని ఆయన వెల్లడించారు. గతంలో వలే సర్వసిద్ది పి.హెచ్.సి లోనే వ్యాక్సిన్ వేయడం కొనసాగించేలా పునరాలోచన చేయాలని సంబంధిత అధికారులను సోమిరెడ్డి రాజు ఆ ప్రకటనలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *