* 1450 కుటుంబాలకు….
*  రూ. 3 లక్షు విలువైన వస్తువులు పంపిణీ

బంగారమ్మపాలెం, 15 మే 2021
———————————————-
యువశక్తి తలచుకుంటే కాని కార్యం ఏముంది. ఆ యువకులు అందరూ ఏకమై కరోనా విపత్కర పరిస్థితులను సైతం ఖాతరు చేయకుండా తమ ప్రజలు కరోనా నివారణకు నడుం బిగించారు.   
1,450 కుటుంబాలకు సుమారు రూ. 3 లక్షల  విలువైన మాస్కులు, శానిటైజర్ బాటిల్స్, టాబ్లెట్స్ ఇంటింటికీ తిరిగి ప్రజలకు పంపిణీ చేశారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని యస్.రాయవరం మండలం వాకపాడు పంచాయతీ శివారు బంగారమ్మపాలెం
గ్రామ యువకుల ఔదర్యం ఇప్పుడు నేనోళ్ళ ప్రశంసిస్తున్నారు. వీరు గ్రామంలోని 1450 కుటుంబాలకు సుమారు 3 లక్షల రూపాయల విలువైన మాస్కులు, శానిటైజర్ బాటిల్స్, టాబ్లెట్స్ ఇంటింటికీ పంపిణీ చేశారు. గ్రామస్తుడైన సూరాడ గోవిందు (42) ఈ నెల 9 వ తేదీన కరోనాతో మృత్యువాత పడ్డారు. దీనితో 10 వ తేదీన గ్రామంలోని గోవిందు పరిసర గృహస్తులకు 42 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా 15 మందికి పోజిటివ్ గా 13వ తేదీన పరీక్షల్లో తేలింది. వీరిని గ్రామంలోనే హోమ్ క్వారంటైన్ లో ఉంచడం జరిగింది. దీనితో స్పందించిన గ్రామ యువత గ్రామంలోని 4,345 మంది గ్రామస్తులకు ప్రయోజనం చేకూరేలా సుమారు 3 లక్షల రూపాయలు చందాలుగా వేసుకొని గ్రామంలో ఉన్న 1,450 గృహాలకు, ప్రతీ గృహానికి 5 మాస్కులు, ఒక శానిటైజర్ బాటిల్, జింకోవిట్ టాబ్లెట్స్ 30, మల్టీ విటమిన్ టాబ్లెట్స్ 30 పంపిణీ చేసారు. అంతేకాక మృతుని కుటుంబానికి చేతనైన ఆర్థిక సాయం చేయడానికి సంసిద్ధులౌ తున్నారు. ఈ యువత  మండలంలోని మిగిలిన గ్రామస్తులకు, యువకులకు ఆదర్శం, స్ఫూర్తి దాయకంగా నిలిచారు. అది చేసాం… ఇది చేసాం… ఇంకా ఏదేదో చేస్తాం అని చెప్పుకొంటూ జబ్బలు చరచుకొని తిరిగే నాయకులు కన్నా ఈ యువకులే ముందుండడం ఎంతైనా అభినంద నీయమని ప్రజలు సంతోషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *