* ఆశ, వలంటీర్ల మూడ్రోజుల సర్వే
* మందుల పంపిణీతోపాటు పరీక్షలు

శంఖవరం, 15 మే 2021
————————————-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపధ్యంలో ప్రజలను మరింత సురక్షితంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆరోగ్య కార్యక్రమానికి శనివారం శ్రీకారం చుట్టింది. పల్లె, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్ళి జ్వర పీడితులు, ఆయా లక్షణాలు ఉన్న ప్రజలను గుర్తించేందుకు సర్వే చేపట్టారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని 14 పంచాయితీలు, 16 సచివాలయాల పరిధిలోని శంఖవరం, పెదమల్లాపరం ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలోని ఆశా కార్యకర్తల విధి నిర్వహణా ప్రాంతాల వారీగా ఒక ఆశా కార్యకర్త, మరో సచివాలయ వాలంటీర్ సహకారంతో మూడు రోజులు పాటు చేపట్టే ఈ జ్వరపీడితుల సర్వేను ప్రారంభించారు. ఈ ఇంటింటి సర్వేలో కుటుంబంలోని ప్రతీ సభ్యుల వారీగా వారిలోని జ్వరం, దగ్గు, రొంప, ఆయాసం వంటి ప్రాధమిక లక్షణాలను గుర్తించి వాటిని ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో అంతర్జాలంలో నిక్షిప్తం చేస్తున్నారు. ఈ వివరాలు ఆధారంగా అవసరమైన మందులను ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుంచి తీసుకొని నేరుగా బాధితుల ఇంటి వద్దకే తీసుకువెళ్లి స్వయంగా అంద జేస్తున్నారు. అవసరం, బాధితుల ఇష్టం మేరకు వారి అంగీకారంతో కరోనా నిర్ధారణ తదితర పరీక్షలను నిర్వహించేందుకు ఆస్పత్రులకు నివేదిస్తున్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని ఏఎన్ఎమ్ లు, వీఆర్వోలు పర్యవేక్షిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల హంగూ ఆర్భాటం లేకుండా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 268 మంది వలంటీర్లు, శంఖవరం ఆస్పత్రి ఆశా కార్యకర్తలు 37మంది, పెదమల్లాపురం ఆస్పత్రి ఆశ కార్యకర్తలు 13 మంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *