my unique outlet coupon code jazzy dancer coupons hygrade hot dogs coupons unique gifts for parents 2015 lowes 10 off coupon 2013 what is a fun bridal shower gift

చిన ఉప్పలం, 16 మే 2021
——————–@——————
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గం యస్.రాయవరం మండలం పెద్ద ఉప్పలం శివారు చిన ఉప్పలం గ్రామంలో త్రాగు నీటి బోరు మోటారు మరమ్మత్తులకు గురై గత వారం రోజులుగా గ్రామస్తులు త్రాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. నీటి బోరు మోటారు మరమ్మత్తులకు రావడంతో పంచాయితీ నీటి సరఫరా నిలిచి పోయి ప్రజలకు కష్టాలు మొదలు అయ్యాయి. ప్రస్తుతం ఎండా కాలం దృష్ట్యా తీవ్ర మంచి నీటి ఎద్దడి ఏర్పడి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా సంబంధిత పంచాయతీ అధికారులు స్పందించకుండా కాల యాపన చేస్తున్నాననీ ప్రజలు ఆరోపిస్తున్నారు.
త్రాగు నీటి కోసం సమీప గ్రామమైన కాపుల వాతాడకు ఒక కిలో మీటరు దూరం వరకూ నడుచుకొని వెళ్ళి నీటిని తీసుకుని వస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను నేటి వరకు పంచాయితీ సిబ్బంది కాని, పంచాయతీ పాలక వర్గం కాని పట్టించు కోలేదు. కావున సంబంధిత అధికారులు, నాయకులు తక్షణమే స్పందించి త్రాగునీటి కొరతని తీర్చి గ్రామ ప్రజల కష్టాలను ఇప్పటికైనా తీర్చాలని సోమిరెడ్డి రాజు (కన్వీనర్, యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ, యస్.రాయవరం మండలం) కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *